Home » Latha Mangeshkar : ల‌తాజీ ఇంటి పేరు వెనుక ఉన్న క‌థ ఏమిటో తెలుసా..?

Latha Mangeshkar : ల‌తాజీ ఇంటి పేరు వెనుక ఉన్న క‌థ ఏమిటో తెలుసా..?

by Anji
Ad

ల‌తా మంగేష్క‌ర్ తండ్రి దీనానాధ్ కుటుంబం గోవాకు చెందిన‌ది. వాళ్ల అస‌లు ఇంటి పేరు హార్దీక‌ర్‌. అయితే పోర్చుగీస్ వారి బారీ నుంచి కుల దైవాల‌ను ర‌క్షించుకోవ‌డానికి ర‌క్తం చిందించి, దేవుడికి ర‌క్తాభిషేకం చేయ‌డం వ‌ల్ల ఆ త‌రువాత అభిషేకి అనేది ఇంటి పేరుగా మారింది. సాధార‌ణంగా మ‌గ‌వాళ్ల పేరు భ‌ట్ అని వ‌స్తుంది. దీనానాద్ తండ్రి గ‌ణేష్ భ‌ట్ అభిషేకి క‌ర్ హ‌దీ శాఖ‌కు చెందిన బ్రాహ్మ‌ణుడు కాగా.. త‌ల్లి య‌శుబాయి మ‌రాఠా. రాణే కుటుంబానికి చెందింది.

త‌ల్లి ప్రోద్భ‌లంతో సంగీతం నేర్చుకున్న దీనానాథ్ త‌న ప్ర‌త్యేక‌త నిలుపుకోవ‌డానికి కొత్త ఇంటిపేరు పెట్టుకున్నాడు. త‌న గ్రామం పేరు అయిన మంగేషి పేరు మీదుగా మంగేష్క‌ర్ అనే ఇంటి పేరు పెట్టుకుని ప్ర‌ముఖుడు అయ్యాడు. అత‌ని 22వ యేట న‌ర్మ‌దాతో 1922లో వివాహం జ‌రిగింది. నాలుగేళ్ల వైవాహిక జీవితం త‌రువాత ప్ర‌సూతి స‌మ‌యంలో న‌ర్మ‌దా మ‌ర‌ణించ‌డంతో 1927లో భార్య చెల్లెలు అయిన సెవాంతితో దీనానాథ్ పున‌ర్వివాహం జ‌రిగింది. దీనానాథ్ షెవాంతీల‌కు 1929లో ల‌తా మంగేష్క‌ర్ జ‌న్మించింది.

Advertisement

Advertisement

చిన్న‌త‌నంలో అమ్మ‌మ్మ ద‌గ్గ‌ర కొంత‌కాలం పెరిగిన ల‌తా మ‌రాఠి జాన‌ప‌ద గీతాల‌తో పాటు గుజరాతీ పాట‌లు నేర్చుకుంది. ఎందుకంటే ఆమె త‌ల్లి షేవాంతి గుజరాతీ మ‌హిళ‌. తాపీ న‌ది ఒడ్డున ఉన్న థాల్ నేర్ అనే చిన్న ఊరు వాళ్ల‌ది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర, గుజ‌రాత్ రాష్ట్రాల‌కు స‌రిహ‌ద్దులో ఉన్న గ్రామం 1910లో సంయుక్త మ‌హారాష్ట్రలో ఉండేది. ఆ ఊరిలో నివ‌సించే సేఠ్ హ‌రిదాస్ రామ్ దాస్ లాడ్ అనే గుజ‌రాతీ వ్యాపార‌స్తుడే ల‌తా మంగేష్క‌ర్ తాత‌య్య సో.. ఆమె మాతృభాష ఏది అంటే గుజ‌రాతీ అని చెప్పుకోవ‌చ్చు.

Also Read :  Latha Mangeshkar: ఒక్క‌రూపాయి తీసుకోకుండా ఎంపీగా సేవ‌లందించిన‌ ల‌తా మంగేష్క‌ర్..!

Visitors Are Also Reading