Home » Latha Mangeshkar: ఒక్క‌రూపాయి తీసుకోకుండా ఎంపీగా సేవ‌లందించిన‌ ల‌తా మంగేష్క‌ర్..!

Latha Mangeshkar: ఒక్క‌రూపాయి తీసుకోకుండా ఎంపీగా సేవ‌లందించిన‌ ల‌తా మంగేష్క‌ర్..!

by AJAY
Ad

ప్ర‌ముఖ‌గాయని ల‌తా మంగేష్క‌ర్ నేడు అన‌గా ఫ్రిబ్ర‌వ‌రి 6వ తేదీ 2022లో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన ల‌తామంగేష్క‌ర్ ఆరోగ్యం విష‌మించ‌డంతో నేడు ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో క‌న్నుమూశారు. ల‌తామంగేష్క‌ర్ తండ్రి దీనానాథ్ మంగేష్క‌ర్ కూడా గాయ‌కుడు మ‌రియు నాట‌కార‌చ‌యిత‌. నిజానికి ల‌తా మంగేష్కర్ అస‌లు పేరు హేమ‌…కానీ ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్క‌ర్ ఓ నాట‌కాన్ని ర‌చించారు.

Advertisement

Latha Mangeshkar biography

ఆ నాట‌కంలో హేమ న‌టించ‌గా అందులో ఆమె పేరు ల‌తా….కాగా ఆ పేరు ఎంత‌గానో న‌చ్చ‌డంతో హేమ ల‌తా మంగేష్క‌ర్ గా పేరు మార్చుకుంది. ల‌తా మంగేష్క‌ర్ లోని టాలెంట్ ను గుర్తించిన ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్క‌ర్ సంగీతం నేర్పించారు. ఇక తాను నేర్చుకున్న పాట‌ల‌ను ల‌తా మంగేష్క‌ర్ త‌న స్కూల్ లో తోటి స్నేహితుల‌కు కూడా నేర్పించేది. దాంతో స్కూల్ అధ్యాప‌కుడు ఆమెను స్కూల్ కు రావ‌ద్ద‌ని చెప్పారు.

Advertisement

Latha mangeshkar

Latha mangeshkar

దాంతో ల‌తా మంగేష్క‌ర్ మ‌ధ్య‌లోనే స్కూల్ మానేసింది. ల‌తా మంగేష్క‌ర్ కు ముగ్గురు చెల్లెల్లు ఒక తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయిన త‌ర‌వాత కుటుంబ బాధ్య‌త‌లు అన్నీ ల‌తా మంగేష్క‌ర్ పైనే ప‌డ్డాయి. కెరీర్ ప్రారంభంలో కొంత‌మంది ద‌ర్శ‌కులు గొంతు భాగాలేద‌ని చెబుతూ ల‌తా మంగేష్క‌ర్ ను తిరస్క‌రించారు. 1949తో మ‌హ‌ల్ అనే సినిమాలో మొద‌టి సారి పాడిన పాట‌కు ల‌తా మంగేష్క‌ర్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

ALSO READ : ఎన్టీఆర్ ప్ర‌ణ‌తిల పెళ్లి మండ‌పం కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చుచేశారో తెలుసా..?

ఆ త‌ర‌వాత ఎన్నో సూప‌ర్ హిట్ పాట‌లు పాడి ప్ర‌ముఖ గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకుంది. సంగీత ప్ర‌పంచంలో గాన కోయిల‌గా ఎదిగింది. ఇదిలా ఉండ‌గా ల‌తామంగేష్క‌ర్ 1999 నుండి 2005 వ‌ర‌కూ రాజ్య‌స‌భ ఎంపీగా సేవ‌లు అందించారు. అమె ఎంపీగా ఉన్నంత కాలం కూడా ఒక్క‌రూపాయి కూడా జీతం తీసుకోలేదు…అంటే ఆమె ఎంత నిజాయితీ ప‌రురాలో అర్థం చేసుకోవచ్చు.

Visitors Are Also Reading