బద్రి, జానీ వంటి సినిమాలతో రేణు దేశాయి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తమిళంలో జేమ్స్ పండు అనే ఓ చిత్రం చేసింది. మొత్తానికి మూడు సినిమాల్లో మెరిసి నటనకు గుడ్ బై చెప్పింది. 20 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు తిరిగి వెండి తెరపై మెరియబోతుంది. తాజాగా రేణు దేశాయి నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించాడు. మాస్ మహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటించిన విషయం విధితమే.
ఇందులో రవితేజ స్టువర్టుపురం గజదొంగగా అలరించబోతున్నారు. నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో రేణు దేశాయి నటించే పాత్ర ఆసక్తిని పెంచుతోంది. హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయి అలరించబోతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అసలు హేమలత లవణం ఎవరు అనేది చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న..? ప్రముఖ రచయిత గుర్రం జాషువా కూతురే హేమలత లవణం. ఆమె ఓ సంఘ సంస్కర్త కూడా. తండ్రి బాటలోనే నడిచి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాతి వివక్ష, అంటరానితనం అనే అంశాలపై తన జీవితం మొత్తం పోరాడారు. ఈ నేపథ్యంలో 19వ దశకంలో తన భర్తతో కలిసి నేరస్తుల్లో మార్పు తెచ్చేందుకు పని చేశారు.
ఇక అదే సమయంలో హేమలత స్టువర్టుపురం గజదొం టైగర్ నాగేశ్వరరావును కలిసినట్టు సమాచారం. ఆ తరువాత ఏమైంది..? నాగేశ్వరరావుపై హేమలత లవణం చూపిన ప్రభావం ఏ మేరకు ఉంది అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. రేణు దేశాయి నటించిన ఈ పాత్ర మూవీకే కీలకం అని తెలుస్తోంది. రెండు దశాబ్దాల తరువాత రేణు దేశాయి రీ ఎంట్రీ ఇవ్వనుండడం.. మరీ అందులో పవర్ పుల్ లేడీ పాత్రను పోషిస్తుండటంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీస్ నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 20న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. అతి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కట్నం విషయంలో బెట్టు చేస్తున్న మెగా ఫ్యామిలీ.. లావణ్య త్రిపాఠి పేరెంట్స్ ఏమంటున్నారంటే..?
కన్నప్ప లో కావాలనే మంచు విష్ణు ఆ స్టార్ హీరోలను ఇరికిస్తున్నారా..? ఆంతర్యం అదేనా ?