Home » కన్నప్ప లో కావాలనే మంచు విష్ణు ఆ స్టార్ హీరోలను ఇరికిస్తున్నారా..? ఆంతర్యం అదేనా ?

కన్నప్ప లో కావాలనే మంచు విష్ణు ఆ స్టార్ హీరోలను ఇరికిస్తున్నారా..? ఆంతర్యం అదేనా ?

by Anji

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఇటీవలే లాంఛనంగా షూటింగ్ మొదటి పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 140 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ మూవీ కోసం మంచు విష్ణు తెగ కష్టపడుతున్నాడు. ఎలాగైనా కన్నప్ప సినిమా తన కెరీర్ లోనే గుర్తుండిపోయేవిధంగా సినిమా చేసేందుకు టాలీవుడ్ తో పాటు ఇతర భాషల నుంచి స్టార్ హీరోల సాయం తీసుకుంటున్నాడు మంచు విష్ణు. 

ఇప్పటికే ప్రభాస్, నయనతార, మోహన్ లాల్ వంటి స్టార్స్ ను కన్నప్ప సినిమాలో ఇంక్లూడ్ చేసిన విష్ణు, తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ను సైతం కన్నప్ప మూవీలో ప్రముఖ పాత్ర కోసం తీసుకున్నారు.  అయితే మరీ ఇంతమంది స్టార్ హీరోలను తీసుకొని మంచు విష్ణు ఏం చేయబోతున్నాడనే ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. మంచు విష్ణు కన్నప్ప మూవీ విషయంలో వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే.. మాత్రం విష్ణు కావాలనే ఈ విధంగా స్టార్ హీరోలను తన సినిమాలో ఇరికిస్తున్నాడనే చర్చలు వినిపిస్తున్నాయి. కథ పరంగా చూస్తే.. మోహన్ బాబు-మంచు విష్ణు ఇద్దరికీ తప్ప కన్నప్ప సినిమాలో మిగతా పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యముండబోదనేది స్ట్రాంగ్ బజ్.

అలాంటప్పుడు ఈ హీరోలందరికీ తీసుకోవడం వల్ల మంచు విష్ణుకు ఒరిగేది ఏమి లేదని.. కేవలం పాపులారిటీ మాత్రమే అని తెలుస్తోంది. కన్నప్ప మూవీని పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ చేయాలంటే అందరిలో రికాగ్నేషన్ ఉన్న హీరోలు అంటే తప్ప సినిమాను ఎవ్వరూ పట్టించుకోరు.. అందుకే విష్ణు ముందుగానే ఆలోచించి పక్కా ప్లానింగ్ తోనే ఇలా ఇండియా వైడ్ ఇమేజ్ ఉన్న స్టార్ లను సినిమాలో క్యాస్ట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి హిందీలో మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప పై గంపెడు ఆశలు పెట్టుకొని చూస్తున్న మంచు విష్ణుకి ఈ చిత్రంతోనైనా బ్రేక్ వస్తుందో లేదో వేచి చూడాలి మరీ.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Samantha : ఆస్పత్రి పాలైన సమంత… ఆందోళనలో ఫ్యాన్స్ ?

బాలకృష్ణ ఇంటికి కోడలుగా ఆ స్టార్ హీరోయిన్ రానుందా..?

Visitors Are Also Reading