Home » హీరో రాజ్ తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి  కారణాలేంటో తెలుసా..?

హీరో రాజ్ తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి  కారణాలేంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad
 షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయి సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్న  హీరో రాజ్ తరుణ్.  వచ్చిన అనతి కాలంలోనే మంచి గుర్తింపును సాధించాడు. సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్,  ఉయ్యాల జంపాల వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి సంచలనాలు సృష్టించాడు.  కుమారి 21ఎఫ్ తర్వాత దాదాపుగా 15 చిత్రాలలో నటించిన రాజ్ తరుణ్ కు ఆ స్థాయి విజయాలైతే దక్కలేదు.
ఇందులో కొన్ని చిత్రాలు యావరేజ్ గా నిలిస్తే,  మరికొన్ని సినిమాలు రాజ్ తరుణ్ కెరియర్ ప్లస్ కాలేదు. పారితోషకానికి ఆశపడి  కథలతో సంబంధం లేకుండా ఓకే బ్యానర్లో  ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించాడు.  కథ, కథనం పట్టించుకోక పోవడం ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం,  ఇలా వరుస ఫైల్యూర్స్ తో ఇండస్ట్రీలో డల్ అయ్యాడు.  మరి ఆ చేసిన సినిమాలకైనా సరైన ప్రమోషన్స్ చేయించుకోకపోవడం రాజ్ తరుణ్ కెరియర్ ని నాశనం చేశాయని చెప్పవచ్చు.
ఇక ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ కు ఆఫర్లు సైతం తగ్గుముఖం పట్టాయని,  డైరెక్టర్ మారుతి కథతో రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.  త్వరలో ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ మూవీతో అయినా రాజ్ తరుణ్ జాతకం మారుతుందేమో  చూడాల్సి ఉంది.  సాయి వర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మే ఫస్ట్ వీక్ లో ఈ మూవీ షూట్ మొదలుకానుండగా ఈ ఏడాది సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. రాజ్ తరుణ్ పారితోషికం తక్కువగానే ఉందని , ఇందులో ఆయన పాత్ర చాలా వెరైటీగా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

Visitors Are Also Reading