ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియలో అనే పాట వినగానే మనందరికీ టక్కున గుర్తుకొచ్చే పేరు ఆర్.నారాయణ మూర్తి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, వ్యవహరించారు. ముఖ్యంగా కమ్యూనిస్టు సినిమాలకు మారు పేరుగా నిలిచారు. ఇప్పటికీ కమ్యూనిజం భావాలున్నాయి. చిన్నప్పటి నుంచి మట్టి వాసన చూస్తూ.. పెరిగిన ఆర్.నారాయణమూర్తికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా హంగు, ఆర్భాటాల లేకుండా సాధారణ వ్యక్తి మాదిరిగానే ఉంటాడు. ఆర్.నారాయణ మూర్తి ఎంతో మంచి వారని ఆయనను కలిసిన ప్రతీ ఒక్కరూ చెబుతుంటారు. ఇప్పటికీ కూడా ఆయన హైదరాబాద్ రోడ్లపై నడుచుకుంటూనే వెళ్తారు.
Advertisement
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉన్న దర్శకుడు కమ్ యాక్టర్. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలిగిన ఏకైక నటుడు ఆర్.నారాయణ మూర్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజ సేవనే ముఖ్యం అని.. ఆస్తులు, అంతస్తులను ఏమి తీసుకుపోలేమనే నినాదంతో ఎప్పుడూ సాదాసీదగానే ఉండే మనిషి.. ఆయన సంపాదించుకోవాలనుకుంటే.. కోట్ల రూపాయలను కూడబెట్టవచ్చు. విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ ఇవేమి తనకు ఇష్టం లేదు. రోడ్డు పక్కనే ఉన్నటువంటి టిఫిన్ సెంటర్ లో తింటాడు. అందరూ ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తాడు. కనీసం బండి పై కూడా వెళ్లకుండా కాలి నడక ద్వారానే వెళ్తూ ఉండే ఏకైక ఫేమస్ నటుడు. ఈయన తనకు ఉన్న ఆస్తిని అంతా పేదలకు పంచిపెట్టిన గొప్ప ధీరుడు. అలాంటి ఆర్.నారాయణ మూర్తి ఎవరైనా సాయం కోసం వస్తే.. తప్పనిసరిగా సహకారం అందిస్తారట.
Advertisement
ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలను చూసి పెరిగిన ఆర్.నారాయణ మూర్తి సినిమా అంటే పిచ్చి పెంచుకొని ఇండస్ట్రీలోకి దర్శకుడిగా నటుడిగా.. నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్న రైతుల పక్షాన, కార్మికుల, కర్షకుల పక్షాన ఉండటం మనం చూశాం. ప్రతీ మూవీలో దోపిడి దురహంకార రాజకీయ వ్యాపారవేత్తలు ఏ విధంగా పేద ప్రజలను అణిచివేస్తారో కళ్లకు కట్టినట్టు చూపిస్తారు ఆర్.నారాయణమూర్తి. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. దీనికి ఓ ప్రత్యేక కారణముందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక వయస్సులో ఉన్నప్పుడు ఆయన ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించారట. అంతేకాదు.. ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబితే వారు అస్సలు ఒప్పుకోలేదట. ఆమెను పెళ్లి చేసుకుంటే మేము సూ*డ్ చేసుకుంటామని కూడా బెదిరించారట. దీంతో ఆ అమ్మాయిని మరిచిపోలేక.. తన జీవితంలో పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యారట ఆర్.నారాయణ మూర్తి. ఇలా ఆయన పెళ్లికి దూరమై.. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఎన్టీఆర్ వేద మంత్రాలు చదివి చేసిన ఏకైక పెళ్లి ఎవరిదో తెలుసా..!
NTR: రాజీవ్ కనకాలతో ఎన్టీఆర్ కు గొడవేంటి..? మొదటి రోజే అలా జరిగేసరికి?