ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్‌లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం లాల్‌సలామ్ . ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 9న భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్‌సలామ్ ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. అయితే సినిమా ఫెయిల్యూర్‌కు కారణం రజినీకాంతేనంటోంది ఐశ్వర్య రజినీకాంత్ .
Advertisement
ఈ విషయమై ఓ చిట్‌చాట్‌లో ఐశ్వర్య మాట్లాడుతూ.. ముందుగా సినిమాలో మోయినొద్దీన్ భాయ్ రోల్ కోసం రజినీకాంత్‌కు 10 నిమిషాలు కామియోను ప్లాన్ చేశాం. అయితే రజనీకాంత్ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రజెంటేషన్‌కు సంబంధించి స్క్రిప్ట్‌లో కొన్ని మార్పుచేర్పులు చేసి.. స్లో మోషన్-ఫైట్ సీన్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేశాం. ఈ మార్పులన్నీ సినిమా పరాజయానికి కారణమయ్యాయి.
Advertisement
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించింది. చాలా కాలం తండ్రీకూతుళ్ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ మూటగట్టుకోవడంతో అభిమానులంతా నిరాశలో మునిగిపోయారు. రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 చేస్తున్నాడని తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో తలైవా 171లో కూడా నటిస్తున్నాడు.
Also Read : చిరంజీవి చేయడం వల్లనే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు.. కారణం అదేనా..?