Home » ప్రియాంక వేసుకున్న పాము నెక్లెస్ ధర ఎంతో తెలుసా ?

ప్రియాంక వేసుకున్న పాము నెక్లెస్ ధర ఎంతో తెలుసా ?

by Anji
Ad

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా రెండు ఇండస్ట్రీలలో హీరోయిన్ గా ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటీమణులలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా   ఒకరు. ఈమె ఏ విషయం అయినా సరే దాచిపెట్టకుండా ఓపెన్ గా చెప్పేస్తోంది. అయితే అలాంటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా వదిలేసి ఎక్కువగా హాలీవుడ్ లోనే నటిస్తోంది. ఇక హాలీవుడ్ లో కూడా ప్రియాంక చోప్రాకు వరుస అవకాశాలు రావడంతో పూర్తిగా హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోతుందని అందరూ భావిస్తున్నారు.

Advertisement

ఇక ప్రియాంక చోప్రా తనకంటే వయసులో చిన్నవాడైన నటుడు..గాయకుడు.. పాటలు రచయిత.. అయిన నిక్ జోనస్  ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక పాపకి కూడా సరోగసి పద్ధతి ద్వారా జన్మనిచ్చింది. అయితే ఈ జంట ఏజ్ లో డిఫరెన్స్ ఎంత ఉన్నా కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే తాజాగా నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక చోప్రా ఇండియాకి వచ్చింది. ఇక అలా వచ్చిన సమయంలో ముంబై లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రియాంక చోప్రా పాల్గొన్న సమయంలో ఆమె మెడలో వేసుకున్న పాము నెక్లెస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.

Advertisement

ఇక పాము నెక్లెస్ చూడడానికి చాలా వెరైటీగా కనిపించడమే కాదు.. దాని ధర తెలిస్తే కూడా మీరందరూ ఏంటి అన్ని లక్షలా అని నోరెళ్ళబెట్టి షాక్ అవ్వాల్సిందే. మరి ఇంతకీ ప్రియాంక చోప్రా  వేసుకున్న ఆ పాము నెక్లెస్ ధర ఎంతో తెలుసా..? ఆ పాము నెక్లెస్ ధర అక్షరాల 58 లక్షల 65 వేలట.. అవును మీరు వినేది నిజమే. ఆ పాము నెక్లెస్ దాదాపుగా 59 లక్షలని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నెక్లెస్ ధర తెలిసి చాలామంది నెటిజన్స్ అంత చిన్న నెక్లెస్ కి అన్ని లక్షలా అని నోరెళ్లబెడుతున్నారు. నెక్సెస్ ధరకి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : హీరోగా లోకేష్.. కమల్ నిర్మాణం.. శృతి సంగీతం..!

 

Visitors Are Also Reading