Home » హీరోగా లోకేష్.. కమల్ నిర్మాణం.. శృతి సంగీతం..!

హీరోగా లోకేష్.. కమల్ నిర్మాణం.. శృతి సంగీతం..!

by Anji
Ad

సాధారణంగా సినిమాల్లో కొత్త కాంబినేషన్ లో వస్తున్నాయంటే ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ రాబోతోంది. కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక ఆయన వారసురాలు శ్రుతిహాసన్ గురించి చెప్పనక్కర్లేదు. అదేవిధంగా ప్రస్తుతం టాప్ మోస్ట్ డైరెక్టర్ గా వెలిగిపోతున్న లోకేశ్ కనకరాజ్ క్రేజ్ ఏమిటన్నది అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు కలిస్తే ఆ ప్రాజెక్ట్ మజానే వేరు కదా?

Advertisement

Advertisement

అవును కమలహసన్ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ను నటింపజేశారు. అయితే ఇది చిత్రంలో కాదు. ఒక స్పెషల్- మ్యూజికల్ ఆల్బమ్ లో. ఈ ఆల్బమ్ ని కమలహాసన్ రూపొందించడంతో పాటు, అందులోని పాటను రాయడం విశేషం. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ పాటను శ్రుతిహాసన్ పాడడంతో పాటు సంగీతాన్ని అందించడం. ఈ ఆల్బమ్కు ఇనిమేల్ అనే టైటిల్ ని నిర్ణయించారు.  దీనికి ద్వారకేశ్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. భువన్ గౌడ చాయాగ్రహణం అందించారు. ఆల్బమ్ న్ను త్వరలో విడుదల చేయనున్నట్లు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా శ్రుతిహాసన్క మ్యూజిక్ ఆల్బమ్లు రూపొందించడం కొత్తేమి కాదు. ఇంతకు ముందు ఎడ్జ్, షీస్ ఏ హీరో, మాస్టర్ మోషన్ పేర్లతో రూపొందించిన మ్యూజికల్ ఆల్బమ్స్ సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. దీంతో తాజాగా క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఇనిమేల్ వీడియో ఆల్బమ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :  ఆ  క్షణాలు ఆనందించలేకపోయా.. చాలా భయపడ్డా.. సమంత సెన్షేషన్ కామెంట్స్..!

Visitors Are Also Reading