మామూలుగా సమోసాలను హోటళ్లలో, బేకరీలలో పలు ప్రాంతాల్లో తయారు చేస్తుంటే మనం లొట్టలేసుకుంటూ తింటాం. అది ఎలా చేస్తున్నారు.. ఏమి పట్టించుకోరు. ఒకటి కాదు రెండు ఏకంగా 30 ఏళ్ల నుంచి విచిత్రంగా సమోసాలను తయారు చేస్తున్నారు. అది ఎక్కడంటే సౌది అరేబియాలో అది ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. ఇదేంటిరా బాబు ఇలా కూడా సమోసా కూడా తయారు చేస్తారా..?
సౌది అరేబియాలోకి 30 ఏళ్లుగా ఈ నిర్వకానికి పాల్పడుతున్న రెస్టారెంట్ వ్యవహారం బయటపడింది. ముఖ్యంగా స్నాక్స్‌తో పాటు భోజనాన్ని కూడా తయారు చేస్తున్నట్టు పక్కా సమాచారం రావడంతో అధికారుల దాడులు చేపట్టారు. కాలపరిమితి ముగిసిన మీట్, చీజ్ వంటి ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కొన్నింటికి రెండేండ్ల కిందటే కాలపరిమితి ముగిసినవి ఉండడం గమనార్హం. పురుగులు, కీటకాలు, ఎలుకలు రెస్టారెంట్‌లో కనిపించడం విశేషం. అక్కడ పని చేసే సిబ్బందికి ఎలాంటి హెల్త్ కార్డులు కూడా లేవు అని రెసిడెన్సీ చట్టాలను పూర్తిగా అతిక్రమించిందని అధికారులు పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement
రెస్టారెంట్‌ను సీజ్ చేసారు. పరిశుభ్రత పాటించని రెస్టారెంట్‌ను సౌదీ అరేబియాలో మూసేయడం ఇది మొదటి సారి కాదు. ఈ ఏడాది ప్రారంభ నెలలోనే ప్రముఖ ష్వార్మా రెస్టారెంట్ను ఇదే కారణంతో మూసేసారు. ఎలుక ఒక స్కేవర్ పైన మాంసం తింటూ రెస్టారెంట్‌లో కనిపించింది. ఓ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది అప్పుడు వైరల్ అయింది. ఈ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేయడంతో సీజ్ చేశారు. ఇక సౌదీఅరేబియాలో 2,833 రెస్టారెంట్లు, హోటళ్లపై తనిఖీలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. జెడ్డా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43 చోట్ల ఉల్లంఘనలను గుర్తించినట్టు.. వాటిలో 26 రెస్టారెంట్‌లను సీజ్ చేసినట్టు వెల్లడించారు.
Also Read :
బాలీవుడ్ గురించి కిచ్చ సుదీప్ ఏమన్నారో తెలుసా..?
వయసు 16నెలలు..16 కోట్ల ఇంజెక్షన్ కావాలి…!