Home » పెళ్లికి ముందు నమ్రతకి మహేష్ బాబు పెట్టిన ఆ ఒక్క కండిషన్ ఏంటో తెలుసా?

పెళ్లికి ముందు నమ్రతకి మహేష్ బాబు పెట్టిన ఆ ఒక్క కండిషన్ ఏంటో తెలుసా?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్. వీరిద్దరిది ప్రేమ వివాహం. వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమగా మారి అది పెళ్లి వరకు దారి తీసింది. ఇవాళ వీరిద్దరి పెళ్లిరోజు. 19 ఏళ్ల క్రితం ఇదే రోజు వీరి పెళ్లి జరిగింది.  సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది వీరికి విషెస్ తెలుపుతున్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విషెస్ తెలుపుకున్నారు. పెళ్లికి ముందు వరకు నమ్రత కొన్ని సినిమాలు చేశారు. పెళ్లి తర్వాత నుండి నమ్రత ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ విషయం గురించి నమ్రత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

mahesh-babu-marriage

Advertisement

Advertisement

 

ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత ఈ విషయం మీద మాట్లాడుతూ.. తనకి ఉద్యోగం చేసే భార్య వద్దు అని మహేష్ బాబు క్లారిటీగా ఉన్నారు అని చెప్పారు. ఈ విషయం మీద వాళ్లు మాట్లాడుకున్నారు  అన్నారు. అయితే.. నమ్రతా శిరోద్కర్ కూడా ఒక కండిషన్ పెట్టారట. తనకి బంగ్లాలో ఉండడం ఇబ్బందిగా అనిపిస్తుంది అని.. అందుకే పెళ్లి  అయిన తర్వాత కొన్నాళ్లు అపార్టుమెంట్ లో ఉండాలి అని ఒక కండిషన్ పెట్టారట. ఈ కండిషన్ కి మహేష్ బాబు అంగీకరించారు.  మహేష్ బాబుకి ఉద్యోగం చేసే భార్య వద్దు అనే కండిషన్ కి నమ్రతా శిరోద్కర్ కూడా అంగీకరించారు.

 

 వీరిద్దరి పరస్పరం అంగీకారంతోనే వారి పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత నమ్రత గౌతమ్, సితారని చూసుకోవడంలో.. మహేష్ బాబు వ్యాపార వ్యవహారాలు కూడా చూసుకోవడంలో బిజీ అయిపోయారు. పెళ్లయ్యాక కూడా నమ్రతకి సినిమాల్లో నటించే కొన్ని అవకాశాలు వచ్చాయట. కానీ నమ్రత ఇందుకు అంగీకరించలేదు. ఎలాంటి పాత్ర వచ్చినా కూడా సినిమాల్లో కనిపించాలి అని అనుకోవట్లేదు అని నమ్రత చెప్పారు. సినిమాల్లో నటించకపోయినా కూడా సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్తాను అని అన్నారు. మహేష్ బాబు సినిమా షూటింగ్స్ కి తాను వెళతాను.  ఆ వాతావరణాన్ని తాను ఎంజాయ్ చేస్తాను అని నమ్రత చెప్పారు.

Also Read  :   చిరంజీవి గదిలో బాలకృష్ణ నెటిజన్లను ఆకట్టుకున్న ఫోటో..!

Visitors Are Also Reading