Home » CHIRANJEEVI : మెగాస్టార్ తన ఫోన్ లో సురేఖ, పవన్, చరణ్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా ?

CHIRANJEEVI : మెగాస్టార్ తన ఫోన్ లో సురేఖ, పవన్, చరణ్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటీ సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. సిల్వర్ స్క్రీన్ పై తనదైన స్టైల్ లో దూసుకెళ్తున్న చిరంజీవి.. బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ హోస్ట్ గా ప్రారంభమైనటువంటి సుమ అడ్డా షోకి అతిథిగా వచ్చేశారు చిరంజీవి. చిరుతో పాటు బాబీ, వెన్నెల కిషోర్, జబర్దస్త్ శ్రీను కూడా ఈ షోలో పాల్గొని సందడి చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది.

Also Read:  మొగల్తూరు లో చిరంజీవి తన ఇంటిని ఎందుకు లిబెర్రీ కి ఇవ్వలేదు ? అసలు కారణం ఇదే !

Advertisement

Advertisement

 

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఎప్పటి మాదిరిగా అడ్డా షో కూడా తనదైన స్టైల్, మేనరిజమ్స్, కామెడీతో కడుపుబ్బా నవ్వించారు చిరంజీవి. ఈ షోలో భాగంగా హోస్ట్ సుమ చిరంజీవిని కొన్ని సరదా ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను రాబట్టేందుకు ప్రయత్నం చేసింది సుమ. చిరంజీవి కుటుంబ సభ్యులు సురేఖ, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పేర్లను ఫోన్ లో ఎలా సేవ్ చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది సుమ. దీంతో చిరంజీవి సురేఖ పేరును రే అని సేవ్ చేసుకున్నట్టు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

దీంతో ఇక అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఇక ఆ తరువాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారని ప్రశ్నించగా..? రామ్ చరణ్ పేరుని చెర్రి అని, పవన్ కళ్యాణ్ పేరుని కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవి తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం కొద్ది గంటల్లోనే థియేటర్లలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే చిత్ర యూనిట్ అడ్డా షోకి హాజరైనట్టు తెలుస్తోంది. వాల్తేరు సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు వేచి చూడాలి.

Visitors Are Also Reading