బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు 10సంవత్సరాల కిందట ప్రారంభమైన ఈ షో అందరి మన్ననల పొందుతూ అద్భుతమైన రేటింగ్స్‌తో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కేవలం ఇండస్ట్రీకి పరిచయమవ్వడమే కాదు.. ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతూ ఏకంగా సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై బిజి బిజీగా గడుపుతున్నారు.
Advertisement
జబర్దస్త్‌లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్ లు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇలా ఎంతో మంది కార్యక్రమానికి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని బయటకు వెళ్లిపోతున్నారు. కానీ గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో కొనసాగుతూనే ఉన్నారు రాకెట్ రాఘవ. ఎన్నో సినిమా షూటింగ్లో పాల్గొంటున్నప్పటికీ జబర్దస్త్ కార్యక్రమాన్ని మాత్రం మిస్ కాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
Advertisement
Also Read : కారులో ఆ చెత్త పని చేస్తూ సమంతాకు అడ్డంగా దొరికిన స్టార్ హీరో డాటర్.. చివరికి..!!
ఇకపోతే రాకెట్ రాఘవకి సైతం ఇతర ఛానల్స్ నుంచి పెద్ద ఎత్తున ఆఫర్స్ వస్తున్నాయట మల్లెమాల వారు ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా రెండింతలు అధిక రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ ఆయన మాత్రం జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వేయలేదు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదలకపోవడానికి గల కారణం ఏంటంటే విషయాన్ని వస్తే తనకు డబ్బు కన్నా మల్లెమాల వారి తో ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని తెలిపారు. అయితే ఈ జబర్దస్త్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Also Read : “గాడ్ ఫాదర్” ను చిరు రాజకీయాల కోసం వాడుకున్నాడా..? ఆ సీన్లన్నీ అందుకోసమేనా..?