Home » పడిగడుపున లవంగాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

పడిగడుపున లవంగాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

by Sravanthi
Ad

లవంగాలు అంటే మనకు ప్రత్యేకంగా గుర్తుకువచ్చేది నాన్ వెజ్.. నాన్ వెజ్ వండినప్పుడు అందులో లవంగాలను ప్రత్యేకంగా చేర్చి ఆ కర్రీకి మరింత రుచిని అందిస్తాము. మసాలా దినుసులలో ఈ లవంగాల కు ప్రత్యేక స్థానం ఉంది. లవంగాలు సువాసన వెదజల్లడమే కాకుండా, శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థా లను బయట పంపించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా ఈ లవంగా లను ప్రతిరోజు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

Advertisement

 

 

మరి వీటిని మనం ఎప్పుడు తీసుకోవాలి..? ఎలా తీసుకోవాలి..? అనే విషయాన్ని చూద్దాం.. స్టవ్ ఆన్ చేసి దానిపై గిన్నె పెట్టి అందులో గ్లాస్ వాటర్ పోయాలి. నీరు వేడి ఎక్కగానే అర చెంచా లవంగాల పొడిని అందులో వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ఆ వాటర్ ఫిల్టర్ చేసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తాగాలి.

Advertisement

దీన్ని ప్రతిరోజూ పడి గడుపున తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు, మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను పోగొడుతుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంచి, ఎముకలు దృఢంగా ఉండేలా తోడ్పడు తుంది. జలుబు, దగ్గు, అతిసారం వంటి సమస్యల నుండి ఉపశమ నాన్ని కల్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజు మనం లవంగాల పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఇలాంటి రోగాలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading