Home » ఆర్తి అగ‌ర్వాల్ చేసిన త‌ప్పే ఉప్పెన బూటీ కూడా చేస్తోందా…? ఇంత‌కీ ఆ తప్పేంటి..!

ఆర్తి అగ‌ర్వాల్ చేసిన త‌ప్పే ఉప్పెన బూటీ కూడా చేస్తోందా…? ఇంత‌కీ ఆ తప్పేంటి..!

by AJAY
Ad

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతిశెట్టి. మొద‌టి సినిమాతోనే ఈ భామ‌కు ప్రెక్ష‌కులు ఫిదా అయిపోయారు. సినిమాలో కృతిశెట్టి క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ కుర్రాళ్ల‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేశాయి. దాంతో ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కృతిశెట్టి వ‌రుస ఆఫ‌ర్ ల‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. బంగార్రాజు, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాల‌లోనూ న‌టించి ప్రేక్ష‌కులను అల‌రించింది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా న‌టించిన వారియ‌ర్ సినిమాలో న‌టించింది.

Advertisement

ఇక ప్ర‌స్తుతం కృతిశెట్టి నితిన్ హీరోగా తెర‌కెక్కుతోన్న మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఫుల్ బిజీగా మారిపోయిన ఈ భామ గురించి కొన్నివార్త‌లు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అంతే కాకుండా ఈ అమ్మ‌డు కూడా హీరోయిన్ ఆర్తి అగ‌ర్వాల్ చేసిన త‌ప్పే చేస్తుందా అంటున్నారు.

Advertisement

Uppena

Uppena

ఆర్తి అగ‌ర్వాల్ నువ్వునాకు న‌చ్చావ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఇచ్చింది. ఆ త‌ర‌వాత గ్యాప్ లేనంత బిజీగా మారిపోయింది. అంతే కాకుండా టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అంద‌రితోనూ జ‌త క‌ట్టింది. ఈ క్ర‌మంలో క‌థ గురించి ప‌ట్టించుకోకుండా ఏ సినిమా వ‌చ్చినా చేసేసింది. సీనియ‌ర్ హీరోల‌తోనూ సినిమాలు చేసింది. అంతే కాకుండా హీరో త‌రుణ్ తో ప్రేమాయ‌ణం వ‌ల్ల సైతం ఆర్తి కెరీర్ డ్యామేజ్ అయ్యింద‌నే వార్త‌లు అప్ప‌ట్లో వినిపించాయి.

kruthishetty

kruthishetty

చివ‌రికి చిన్న వ‌య‌సులోనే ఆర్తి క‌న్నుమూసింది. ఇక ఇప్పుడు ఆర్తి అగ‌ర్వాల్ మాదిరిగానే కృతిశెట్టి సైతం సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న కూడా న‌టించేందుకు రెడీ అయ్యిందట‌. ఇప్ప‌టికే ఓ త‌మిళ సీనియ‌ర్ హీరో ప‌క్క‌న న‌టించేందుకు ఓకే చెప్పింద‌ట‌. దాంతో ఆర్తి చేసిన త‌ప్పే కృతి కూడా చేస్తుంద‌ని టాలీవుడ్ లో టాక్.

Visitors Are Also Reading