బ్రిటన్ రాణిగా 70 ఏళ్ల పాటు కొనసాగిన క్వీన్ ఎలిజబేత్ 2 గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్ లో తుదిశ్వాస విడిచారు. బ్రిటన్ చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు మహారాణిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది క్వీన్ ఎలిజబెత్ 2. ఈమెకు భారత్ తో ఊడా మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. క్వీన్ ఎలిజబెత్ మూడు సార్లు భారత్‌లో పర్యటించారు.
Advertisement
మొదటి సారి 1961లో పర్యటించగా, రెండవ సారి 1983లో, మూడవ సారి 1997లో ఆమె భారత్ కి వచ్చారు. ఈమె పర్యటనల్లో భాగంగా క్వీన్ ఎలిజబెత్ ఢిల్లీ, ఆగ్రా, చెన్నై, ముంబై నగరాల్లో పర్యటించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ అందాలను వీక్షించి ముగ్దులయ్యారు. ఇక 1947 లో క్వీన్ ఎలిజబెత్ 2 పెళ్లి జరిగిన సమయంలో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఖరీదైన వజ్రాలు పొదిగిన హారాన్ని వివాహ కానుకగా ఆమెకు బహుమానం ఇచ్చారు. అప్పటికే ప్రపంచంలోకెళ్లా అత్యధిక సంపన్నుడిగా పొందిన నిజాం నవాబ్ తన స్థాయికి తగ్గట్టుగా ఖరీదు అయిన కానుక ఇవ్వాలని భావించారు. లండన్ కి చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్ ప్రతినిధులను క్వీన్ ఎలిజబెత్ వద్దకు నిజాం నవాబ్ పంపించారు.
Advertisement
ఇది కూడా చదవండి : మెగాస్టార్ నుండి అల్లు అర్జున్ వరకు వారికిష్టమైన ఆహారపదార్థాలు.. ఏంటంటే..?
రాణి ఎలిజబెత్ స్వయంగా వివాహ కానుకను సెలెక్ట్ చేసుకోవాలని అందుకనుగుణంగా ఆభరణాన్ని తయారు చేయాలని సూచించారు. దీంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్ ని ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది. నిజాం నవాబ్ కానుకగా ఇచ్చిన నెక్లెస్ లో 300 వజ్రాలు ఉండడ విశేషం. 70 ఏళ్ల తన పాలనలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఎన్నో విలువైన కానుకలు అందుకున్నారు. వాటిలో నిజాం నవాబ్ ఇచ్చింది ప్రత్యేకమైందనే చెప్పుకోవాలి. ఇక దీని విలువ 66 మిలియన్ ఫౌండ్లకు ఉంటుందట. నిజాం ఇచ్చిన ఈ నెక్లెస్ ని క్వీన్ ఎలిజబెత్ తరుచూ ధరించే వారు. వజ్రాల నెక్లెస్ ని ధరించిన ఈ ఫోటో జులై 21, 2022న బ్రిటన్ రాజ కుటుంబం అధికారిక ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేయడం విశేషం.
ఇది కూడా చదవండి : వైరల్ సెలబ్రెటీ జంట.. మహాలక్ష్మి పిల్లల విషయంలో ఆ కండిషన్ పెట్టిందంటున్న చంద్రశేఖర్..!