పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాణిస్తూ.. మరోవైపు వరుస సినిమాలను చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా బ్రో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వినోదయ సీతమ్ అనే తమిళ మూవీ రీమెక్ గా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. జులై 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది.
Advertisement
తమిళ ఒరిజినల్ వెర్షన్ పేరు వినోదయ సీతమ్ అంటే తమిళంలో వెర్రి మనస్సు అని అర్థం. కానీ సముద్రఖని ఈ సినిమాని తెలుగులో బ్రో అనే పేరుతో రీమేక్ చేశారు. తొలుత ఈ చిత్రానికి వేరే టైటిల్ అనుకున్నట్టు దర్శకుడు సముద్రఖని చెప్పుకొచ్చారు. ఫస్ట్ ఈ సినిమాకు కాల పురుషుడు అనే టైటిల్ ని అనుకున్నారట. ఈ టైటిల్ వినడానికి పవర్ ఫుల్ గా, మాస్ గా ఉన్నప్పటికీ ఈ టైటిల్ సినిమా కంటెంట్ తప్పు అంచనాలకు దారి తీస్తుందని భావించి బ్రో అని ఫిక్స్ చేశాడు దర్శకుడు సముద్ర ఖని. ఒరిజినల్ లో సముద్ర ఖని నటించడమే కాదు.. ఈ చిత్రానికి డైరెక్టర్ గా కూడా చేశారు. తెలుగు వెర్షన్ రీమేక్ కి కూడా సముద్ర ఖని దర్శకత్వం వహించనున్నారు. మాటలు అందిస్తూ.. తెరవెనుక అన్నీ తానై చూసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Advertisement
సుఫ్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించడంతో మెగా అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ విడుదల విషయంలో ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్రో మూవీని ఓటీటీలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 02 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అధికారికంగా మాత్రం ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరలమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో OG వంటి సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆర్.నారాయణ మూర్తి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?
“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !