Home » తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

by Bunty
Ad

మన టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలలో నటించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు. ఇండస్ట్రీలో అలా సంపాదించడం అంటే చాలా కష్టం. వారు చేసే యాక్టింగ్ కి, ఫిట్నెస్ కి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ప్రేక్షకులకు నచ్చడానికి వారు కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. మన స్టార్ హీరోలు వారి మొదటి సినిమాలో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

# చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన మొదటి సినిమాలో నటించినందుకు గాను కేవలం 1,116 లు మాత్రమే తీసుకున్నాడట. ఇక ప్రస్తుతం ఒక్క సినిమాలో నటించినందుకు గాను 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

# ప్రభాస్

పాన్ ఇండియన్ హీరోగా పేరు పొందినటువంటి ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ లో నటించినందుకుగాను 5లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట.

# మహేష్ బాబు

అతిచిన్న వయసు నుంచే ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా తన మొదటి సినిమా రాజకుమారుడుతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాలో నటించినందుకుగాను 5-10 రెమ్యూనరేషన్ అందుకున్నాడు.

# పవన్ కళ్యాణ్

Advertisement

పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తన నటనకుగాను నెలకు 5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.

# జూనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ తన మొదటి సినిమాలో 4లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ పొందాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

# అల్లు అర్జున్

అల్లు అర్జున్ తన మొదటి సినిమాలో నటించినందుకు గాను కేవలం 100 రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే రాఘవేంద్రరావు అల్లు అర్జున్ కి ఇచ్చాడట. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి గాను 80 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

# విజయ్ దేవరకొండ

తన సినీ కెరీర్ ప్రారంభంలో ఆయన నటించిన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాల్లో నటించినందుకు విజయ్ దేవరకొండ అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఇక తను సినిమాల్లోకి రాకముందు ట్యూషన్ చెప్పేవాడట. అందుకుగాను అతను కేవలం 500 రూపాయలు మాత్రమే తీసుకునేవాడినని అదే నా మొదటి రెమ్యూనరేషన్ అని చెబుతాడు.

ఇవి కూడా చదవండి

కాలికి నల్ల దారాన్ని… ఈ మూడు రాశుల వారు తప్పక కట్టుకోవాలి..!

అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు పడిపోతారంట!

ఉదయం నీళ్లు తాగేటప్పుడు ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదు…!

Visitors Are Also Reading