Home » స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో వచ్చిన మొట్ట మొదటి సినిమా ఏదో తెలుసా ?

స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో వచ్చిన మొట్ట మొదటి సినిమా ఏదో తెలుసా ?

by Anji
Ad

భారతీయ సినీ పరిశ్రమలో అన్ని రకాల సినిమాలు తీయగలిగే ఇండస్ట్రీగా టాలీవుడ్ కి మంచి పేరుంది. ఇక ముఖ్యంగా ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే స్వాతంత్రోద్యమ సినిమాలు, దేశభక్తి చిత్రాలు కాస్త కొంచెం తక్కువగానే రూపొందాయి. అయితే ఉన్న వాటిలో మాత్రం చెప్పుకోదగిన చిత్రాలు చాలానే ఉన్నాయి. స్వాతంత్రోద్యమ నేపథ్యంలో వచ్చిన మొట్టమొదటి తెలుగు సినిమా మనదేశం. ఆగస్టు 15  స్వాతంత్రోత్సవ దినోత్సవం సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 1932 నుంచే సినిమాలు రూపొందుతున్నప్పటికీ వాటిలో పౌరాణికాలు, భక్తిరసాలు, జానపదాలు, రాజ్యమేలుతున్న రోజులు. అడపా దడపా కొన్ని సాంఘిక చిత్రాలు కూడా వచ్చేవి. కానీ అప్పటివరకు దేశభక్తి నేపథ్యంలో ఒక్క సినిమా కూడా రాలేదు. అలాంటి సమయంలో తొలి తరం తెలుగు నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి, ఆమె భర్త మీర్జాపురం రాజాతో కలిసి మన దేశం చిత్రాన్ని నటించి నిర్మించింది. శరత్ చంద్ర రాసిన బెంగాలీ నవల విప్రదాస్ ఆధారంగా తీసిన ఈ చిత్రంలో నారాయణరావు, చిత్తూరు నాగయ్య ప్రధానపాత్రల్లో నటించగా, కృష్ణవేణి హీరోయిన్ గా నటించింది. ఇక ఎన్టీ రామారావు ఈ సినిమాలో ఒక చిన్న పోలీస్ పాత్ర పోషించారు. ఎన్టీఆర్ నటించిన మొట్ట మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక  వీరితో పాటు రేలంగి కూడా నటించారు. ఎల్.వీ.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1949 నవంబర్ 24న విడుదలైంది.

Advertisement

స్వాతంత్రోద్యమంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తాడు హీరో. ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ ఉద్యమ కారుల కష్టాలను చూసి చలించిపోయిన హీరోయిన్ ఆమె తన వంతు పాత్రగా మహిళలతో కలిసి విప్లవం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో దేశ స్వాతంత్రానినికి ఏ రకంగా కృషి చేశారు. చివరికి వాళ్ళ కల నెరవేరిందా అన్నదే ఈ సినిమా కథ. చిన్న కథే అయినప్పటికీ ఆనాటి స్వాతంత్రోద్యమ ఉద్యమకాలం పరిస్థితిలను కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ఈ సినిమా చూసే వాళ్లకి పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చేమో కానీ. ఆ రోజుల్లో మాత్రం ఎంతో మందిని కదిలించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రెండేళ్లకు ఈ సినిమా వచ్చింది. ఇక మన దేశం చిత్రం విడుదలైన తర్వాత పూర్తిస్థాయి స్వాతంత్రోద్యమ చిత్రం మళ్ళీ రావడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. పూర్తిస్థాయిలో వచ్చిన స్వాతంత్రోద్యమ చిత్రం మాత్రం అల్లూరి సీతారామరాజు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అనసూయ లేటెస్ట్ లుక్ వైరల్.. ఈ లుక్ ఎవరిది? అనసూయ ఇలా ఎందుకు కనిపిస్తోంది?

 Nani: నానిని తిట్టిపోస్తున్న టాలీవుడ్ ఆడియన్స్.. కారణం ఏంటంటే?

Visitors Are Also Reading