ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నటి పవిత్ర లోకేష్ గురించే అనేక వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవిత్ర లోకేష్ మరియు నరేష్ ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారని దానికి సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
వీరి వెడ్డింగ్ కు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందర్నీ షాకుకు గురి చేస్తున్నారు. మరి వీరి పెళ్లి జరిగిందా లేదా అనేది ఇంతవరకు క్లారిటీగా తెలియదు కానీ, మీరు దుబాయ్ కి హనీమూన్ కూడా వెళ్లాలని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.
Also Read: కీరవాణికి అమ్మాయి పేరు పెట్టడం వెనుక ఇంత కథ ఉందా..!!
ఈ తరుణంలోని నటి పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి కూడా కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.. మరి ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇప్పుడు తెలుసుకుందాం.. పవిత్ర కర్ణాటకలోని మైసూర్ లో పుట్టింది. తండ్రి పేరు మైసూర్ లోకేష్. కర్ణాటక స్టేట్ ఫిలిం యాక్టర్. ఆమె తల్లి టీచర్. అంతే కాదు వీరికి ఆది లోకేష్ అనే బ్రదర్ ఉన్నాడు. 9వ తరగతి చదువుతున్న టైంలో వారి తండ్రి మరణించడంతో కుటుంబ భారం మొత్తం పవిత్ర పై పడింది. తండ్రి నట వారసత్యాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న పవిత్ర కన్నడ టివి నటిగా కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది.
Advertisement
Also Read:JR:ఎన్టీఆర్ ఎదుగుదలను ఓర్వలేకపోతున్న బాలయ్య.. కారణమేంటంటే..?
ఆమె చదువుకునే రోజుల్లోనే నటన వైపు రావడంతో డిగ్రీ కంప్లీట్ చేసింది. అంతేకాకుండా సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యిందట. కానీ రిజల్ట్ తేడా కొట్టడంతో నటిగా కెరియర్ కొనసాగించాలని డిసైడ్ అయ్యి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయింది. కన్నడలో 50 పైగా చిత్రాల్లో చేసింది. ఇలాంటి పవిత్ర తన మొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసుకొని విడాకులు తీసుకొని, తర్వాత కన్నడ యాక్టర్ సుచీంద్ర ప్రసాద్ తో 11 ఏళ్లపాటు సహజీవనం చేసి ఆ తర్వాత అతని నుండి విడిపోయి నరేష్ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం ఆయనతో వివాహం కూడా జరిగిందనే వార్తలు బయటకు వస్తున్నాయి.
Also Read:91 ఏళ్ల కీరవాణి తండ్రి యంగ్ గా కనిపించడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.!!