Home » రవితేజ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా ?

రవితేజ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా ?

by Anji
Ad

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన మూవీ టైగర్ నాగేశ్వరరావు.  అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించాడు.  రవితేజ, నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.  2022 ఏప్రిల్ 3న షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 20న  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఇప్పుడు  ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాల గురించి మనం  తెలుసుకుందాం.

tiger nageswara rao

Advertisement

ప్రధానంగా ఇందులో రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో.. అనుపమ్  రాఘవేంద్ర రాజ్ పుత్ పాత్రలో.. గాయత్రి భరద్వాజ్ (మనీ), నుపూర్ సనన్ (సారా), రేణు దేశాయ్ (హేమలత లవణం), నాజర్ ( గాజల్ల ప్రసాద్), మురళీ శర్మ (విశ్వనాథ శాస్త్రీ), జిస్  సేన్ గుప్త (సీఐ మౌళి), సుదేవ్ (కాశి), హరీష్ పెల్వడి ( యలమంద) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ  అతి పెద్ద దొంగ పాత్రలో నటించనున్నారు.  ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. మేకర్స్ రవితేజను మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దారు. రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లకు పైగా ఉంటుందని.. తమ కంటెంట్‌పై గట్టి నమ్మకంతో సినిమాపై ఇంత భారీ బడ్జెట్ పెట్టడానికి మేకర్స్ భయపడటం లేదని, అందుకే సినిమా కోసం ఎక్కడా రాజీపడలేదని పేర్కొంటున్నారు మూవీ మేకర్స్. 

Advertisement

అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కూడా అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవాలని కోరుకుందాం. కార్తికేయ 2 మరియు కాశ్మీర్ ఫైల్స్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఇప్పుడు పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో రాబోతోంది. ఈ చిత్రం అక్టోబర్ 20, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.  ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

నాగార్జున విషయంలో అప్పుడు టబు..ఇప్పుడు అనుష్క అలా చేశారా..!

ఆర్జీవీ సినిమా “వ్యూహం”లో విలన్ ఎవరో తెలుసా? మెగా ఫాన్స్ తో చిచ్చు మొదలు కాబోతోందా?

Visitors Are Also Reading