ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి ఒకేచోట నేలపై కూర్చొని భోజనం చేసేవారు. ఇప్పుడు కాలం మారింది. అప్పటి మాదిరిలా కాకుండా అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొవడానికీ ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. ఇంటిల్లి పాది కలిసి కూర్చొని తినే సమయం కూడా లేకుండా పోయింది. అంతా బిజీ బిజీ ఎవరి సమయం వారిది. ప్రశాంతంగా కలిసి కూర్చొని తినే సమయం అసలు లేకుండా పోయింది. కానీ అలా డైనింగ్ టేబుల్ పై కూర్చొని తినే అలవాటు పలు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. హాయిగా నేలమీద కూర్చొని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. నేలమీద కూర్చొని తినడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నేల మీద కూర్చొని భోజనం చేయడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు. ఊబకాయం దరిచేరదు. నేలపై కూర్చొని తినడం వల్ల శరీరం నిటారుగా ఉంటుంది. దీంతో ఆహారం తిన్నప్పుడు నేరుగా జీర్ణాశయం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు ఈజీగా చేరుతుంది. అదేవిధంగా మనస్సు ప్రశాంతంగా మొత్తం దృష్టి అంతా కూడా ఆహారంపైనే ఉంటుంది. అందువల్ల మీరు అతిగా తినకుండా ఉంటారు. దీంతో బరువు అదుపులో ఉంటుంది. అదేవిధంగా శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. నేలపై కూర్చొని తినడంలో కాళ్లు అడ్డంగా మడుచుకుని కూర్చునే స్థితిలో ఒక ఆసనం ఏర్పడుతుంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : గుర్తుపట్టలేని విధంగా సమంత.. అసలు కారణం అదేనా..?
పద్మాసనం భంగిమా దీంతో వెన్ను నిటారుగా ఉంచడం ద్వారా మనకు తెలియకుండానే యోగి చేసిన లాభం కలుగతుంది. కింద కూర్చొని తినడంతో కండరాలు బలంగా మారుతాయి. నేలపై కూర్చొని ఆహారం తినేవారి శరీరం చురుకుగా సరళంగా ఉంటుంది. ఎముకల బలహీనత కూడా తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరం అవుతాయి. జీర్ణరసాల నియంత్రణను పెంచుతుంది. కడుపులో ఆమ్లాన్ని పెంచడంలో సహాయపడే ఉదర కండరాలను కూడా ప్రేరేపిస్తుంది.
ఇది కూడా చదవండి : వర్షాకాలంలో మీ చిన్నారులను దోమ కాటు నుంచి రక్షించడానికి చిట్కాలు ఇవే..!
మనస్సును రిలాక్స్ చేస్తుంది. పద్మపానం ధ్యానానికి అనువైంది. మనస్సును రిలాక్స్ గా ప్రశాంతంగా ఉంచడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. బంధాలను బలపరుస్తుంది. సాంప్రదాయకంగా భారతీయులు కుటుంబ సమేతంగా కలిసి భోజనం చేస్తారు. ఒకరికొకరు రోజు ఎలా గడిచిందో బంధం, ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ప్రతీ ఒక్కరినీ సంతోషంగా రిలాక్స్ గా చేస్తుంది. ఇష్టమైన వారితో ఆహారం తీసుకుంటారు. మీ కుటుంబంతో కలిసి నేలపై తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
ఇది కూడా చదవండి : ప్రతి రోజు వంటల్లో నువ్వులను తప్పక వాడండి.. ముఖ్యంగా మహిళలకు అయితే !