Home » బాదం గింజ‌ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మీకు ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయో తెలుసా..?

బాదం గింజ‌ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మీకు ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయో తెలుసా..?

by Anji
Ad

సాధార‌ణంగా చాలా మందికి ఏదో ఒక ర‌క‌మైన చిరుతిళ్లు తినే అల‌వాటు ఉంటుంది. అవి లేనిది వారికి రోజు వారి డైట్ పూర్త‌వ్వ‌దు. ఈ చిరుతిళ్ల‌ను స‌రైన వాటిని ఎంచుకొని స‌రైన స‌మ‌యంలో తినాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. డ్రైప్రూట్స్‌, న‌ట్స్ లాంటివి స్నాక్స్‌గా తీసుకుంటే చాలా ఆరోగ్యం, మంచి అల‌వాటుగా అంటుంటారు. వీటిలో కీల‌క‌మైన‌ది బాదంప‌ప్పుగా చెప్ప‌వ‌చ్చు. బాదంతో లెక్క‌లేన‌న్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు ఉంటాయ‌ట‌. ఈ బాదం ప‌ప్పుని ప్ర‌తీ రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో, ఏ స‌మ‌యంలో తిన‌డం స‌రైందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

ఇవి కూడా చ‌ద‌వండి :  Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు పాటించాలి

Advertisement


ముఖ్యంగా బాదం గింజ‌ల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మ‌న‌ల్ని చాలా యాక్టివ్ గా ఉంచ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాదంని విట‌మిన్ బి6 ల‌భించే అర‌టిప‌ళ్లు, ఓట్స్ తో క‌లిపి తీసుకుంటే అందులో ఉండే ట్రిప్టోఫాన్ శ‌రీరంలో సెరొటోనిన్‌గా మారుతుంది. ఇక ఈ సెరొటోనిన్ మ‌న శ‌రీరంలో ఎన‌ర్జీ బూస్ట‌ర్ మాదిరిగా ప‌ని చేస్తుంది. మ‌న‌లో ఉత్సాహాన్ని పెంచ‌డంతో పాటు వ్యాకుల‌త‌ని కూడా త‌గ్గిచండానికి స‌హాయ‌ప‌డుతుంది. ఇందుకోసం ప్ర‌తి రోజు ఉద‌యం వేళ‌లో ఓట్స్ తో పాటు అర‌టిప‌ళ్లు, బాదం క‌లిపి తీసుకుంటే ప్ర‌యోజ‌న‌క‌రం. బాదంలో విట‌మిన్ ఈ పుష్క‌లంగా ఉండ‌డంతో రోజూ 20 బాదం గింజ‌లు తిన‌డం వ‌ల్ల రోజు వారిగా తీసుకోవాల్సిన మోతాదులో 40 శాతం విట‌మిన్ ఈ పొంద‌వ‌చ్చు.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  ఈ 5 నియ‌మాలు పాటిస్తే భార్య భ‌ర్త ప్రేమ‌ను సులభంగా పొంద‌వచ్చ‌ట‌..! 3వ‌ది చాలా ముఖ్య‌మైన‌ది..!


విట‌మిన్ ఈ మ‌న‌కు అల్జీమ‌ర్స్ వ్యాధి, ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు, హృద‌య నాళ సంబంధ జ‌బ్బులు ప్ర‌మాదాన్ని త‌గ్గించ‌డంలో తోడ్ప‌డుతుంది. కొన్ని ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం.. బాదంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, మాంగ‌నీస్‌, విట‌మిన్ కే, ప్రొటిన్, జింక్ కాప‌ర్‌లు ఎముక‌లు ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాయి. శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచ‌డంలో బాదం గింజ‌లు అద్భుతంగా ప‌ని చేస్తాయి. టైప్ 2 డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారు బాదం ప‌ప్పుల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. రోజు బాదం గింజ‌ల‌ను తీసుకోవ‌డంతో ఆక‌లిని త‌గ్గిస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గ‌డానికి అవ‌కాశ‌ముంటుంది. బాదంను ఉద‌యం వేళ‌లో తీసుకోవ‌డం వ‌ల్ల‌నే ఎక్కువ ప్ర‌యోజ‌నాలుంటాయి. ఉద‌యం వేళ‌లో తిన‌డం వ‌ల్ల జీవ‌క్రియ మెరుగుప‌డ‌డంతో పాటు ర‌క్తంలో చ‌క్క‌ర స్థాయిలు అదుపులో ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఒక్క వెల్లుల్లి రెబ్బ‌తో టాయిలెట్ క్లీన్‌.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading