Home » వామ్మో.. 513 అంతర్జాతీయ అవార్డులు.. ‘బేబీ’ సెకండ్ హీరో విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?

వామ్మో.. 513 అంతర్జాతీయ అవార్డులు.. ‘బేబీ’ సెకండ్ హీరో విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ లో రీసెంట్ గా  విడుదలైన మూవీ బేబీ. విడుదలకు ముందు ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాను  విడుదల చేసేందుకు కూడా బయ్యర్స్ ముందుకు రాలేదు. విడుదలైన తరువాత అన్ని ప్రాంతాల్లో మంచి వసూలు సాధించడంతో రెండు రోజుల్లోనే ఈ సినిమాకి థియేటర్లు పెరిగిపోయాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా పలు షార్ట్ ఫిలింస్ ద్వారా సోషల్ మీడియాలో ఉండే నెటిజన్లకు పరిచయమే. సెకండ్ హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ గురించి మాత్రం పెద్దగా ఎవ్వరికీ తెలియదు.  చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అతనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Advertisement

బేబీ మూవీ కంటే ముందే అనగనగా ఓ ప్రేమ కథ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు విరాజ్ అశ్విన్. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం కూడా వహించాడు. కానీ ఆ చిత్రం అంతగా సక్సెస్ సాధించలేదు. ఆ తరువాత అనసూయతో కలిసి థాంక్యూ బ్రదర్ చిత్రంలో నటించాడు. ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. యావరేజ్ టాక్ ని దక్కించుకుంది. ఆ తరువాత ఈ హీరో మనసానమ: అనే షార్ట్ ఫిలింలో కూడా నటించాడు. దాదాపు 16 నిమిషాలు నిడివి కలిగి ఉన్న ఈ షార్ట్ ఫిలిం ఓ సెన్షేషన్ నే  సృష్టించింది. గత ఏడాది విడుదలైన ఈ షార్ట్ ఫిలింకి 513 అంతర్జాతీయ అవార్డు రావడం విశేషం. 

ఆ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న మొట్టమొదటి షార్ట్ ఫిలీంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అలాంటి రికార్డు ఉన్నప్పటికీ ఇతనికి అవకాశాలు పెద్దగా రాలేదు. ఈ షార్ట్ ఫిలిం తరువాత ఆయన హీరోగా నటించిన మాయపేటిక మూవీ ఇటీవలే విడుదలై డిజాస్టర్ అయింది. కానీ తాజాగా విడుదలైన బేబీ మూవీ మాత్రం విరాజ్ అశ్విన్ కెరీర్ ని మలుపు తిప్పిన మూవీ అనే చెప్పాలి. ఈ సినిమా తరువాత ఆయనకు అవకాశాలు కూడా భారీగానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరొక విశేషం ఏంటంటే.. విరాజ్ అశ్విన్ తన చిన్నతనంలోనే పవన్ కళ్యాణ్ తో దిగిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Jeevitha Rajashekar: షాకింగ్.. జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు

Rx 100 మూవీలో హీరోయిన్ ఛాన్స్ ని చేతులారా మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading