Home » స్టార్ హీరో యష్ కు, హీరోయిన్ శ్రీలీలాకు మధ్య ఇలాంటి రిలేషన్ ఉందని తెలుసా..?

స్టార్ హీరో యష్ కు, హీరోయిన్ శ్రీలీలాకు మధ్య ఇలాంటి రిలేషన్ ఉందని తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీ లీల పేరు మారుమోగిపోతోంది. పెళ్లి సందD సినిమా ద్వారా ఇండస్ట్రీలో అందరికీ పరిచయమైన శ్రీ లీల మంచి గుర్తింపు సాధించిందని చెప్పవచ్చు. అయితే ఈ హీరోయిన్ ని చూసి చాలామంది సినీ బ్యాగ్రౌండ్ ఉందని అనుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆమె కేజీఎఫ్ హీరో యష్ బంధువు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే శ్రీ లీలకు ఈ కన్నడ హీరోకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Also Read;నటి తమన్నా ఆస్తుల విలువ తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..!!

Advertisement

బెంగళూరులో ఉంటున్న ఒక తెలుగు డాక్టర్ కి పుట్టింది శ్రీలీల. తన తండ్రి ఓ పొలిటీషియన్. వీరిద్దరు విడిపోయిన తర్వాత శ్రీ లీలా జన్మించింది. చిన్నతనం నుంచి శ్రీలీలా కర్ణాటకలోనే పెరిగింది. తన తల్లి లాగా డాక్టర్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివింది. ప్రస్తుతం ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ తరుణంలోనే కన్నడ స్టార్ హీరో యష్ కుటుంబానికి మరియు శ్రీలీల కుటుంబానికి మధ్య బంధుత్వం ఉందని కొన్ని వార్తలు వినిపిస్తున్నారు.

ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో శ్రీ లీలా క్లారిటీ ఇచ్చింది. తనకు యష్ కుటుంబానికి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పింది. దీనికి కారణం యష్ భార్య రాధికాకు తన తల్లి డెలివరీ చేశారంటూ చెప్పింది. తన ఇద్దరు పిల్లలకు మా తల్లి డాక్టర్ కావడం వల్ల పురుడు పోసే అవకాశం వచ్చిందని చెప్పింది. దీనివల్లే మాకు యష్ కుటుంబానికి మధ్య స్నేహపూర్వక బంధం ఏర్పడిందని తెలియజేసింది. మా మధ్య ఎలాంటి రక్తసంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది శ్రీలీలా.

Also Read;మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా సినిమాల్లో నటించిన విషయం మీకు తెలుసా ?  

Visitors Are Also Reading