Telugu News » Blog » ఆ స్టార్ హీరోయిన్ ఆస్తులను సర్కారు స్వాధీనం చేసుకుందని మీకు తెలుసా..?

ఆ స్టార్ హీరోయిన్ ఆస్తులను సర్కారు స్వాధీనం చేసుకుందని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించారో మనందరికీ తెలుసు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి పరిచయమైన సినిమా మన దేశం. ఈ చిత్రం 1949లో విడుదలవగా ఇందులో చిత్తూరు నాగయ్య హీరోగా చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ చిన్న పోలీస్ పాత్రలో చేయగా ఇందులో హీరోయిన్ శ్రీకృష్ణవేణి.. ఈ సినిమా తర్వాత కృష్ణవేణి చాలా పాపులర్ అయింది. అయితే ఈ సినిమాలో కృష్ణవేణికి ఛాన్స్ రావడానికి కారణం రేలంగి వెంకట్రామయ్య. ఆయన నాటకాలను ప్రొడ్యూస్ చేసేవారు. అందులో కృష్ణవేణి నటించేది. ఈ విధంగా రేలంగి వెంకటరామయ్య పుల్లయ్యకు, కృష్ణవేణి ని పరిచయం చేశారు.

Advertisement

Advertisement

మొదటిసారి రేలంగి వెంకట్రామయ్య నిర్మాణం లో పుల్లయ్య రామదాసు అనే నాటికకు వెళ్లారు. అక్కడ కమల పాత్ర చేస్తున్న కృష్ణవేణి ని చూశారు. ఆ తర్వాత ఆమెను మద్రాస్ కి పిలిపించుకొని ఒక పాత్ర ఇచ్చారు. అది జనాలకు ఎంతో కనెక్ట్ అవడంతో 13 ఏళ్ల వయసులోనే కృష్ణవేణి హీరోయిన్ గా మారింది. ఇక కృష్ణవేణి బోజా కాళిదాసు సినిమాలో కన్నాంబ మొదటి హీరోయిన్ అయితే కృష్ణవేణి రెండవ హీరోయిన్. ఈ చిత్రాన్ని మీర్జాపురం రాజావారు నిర్మించారు.. ఇందులో కచదేవయాని పాత్రలో నటించింది కృష్ణవేణి. ఆమె తన జీవితం మొత్తం జయ ఫిలిమ్స్ వారి దగ్గరే ఉండిపోయింది. అలా వాళ్ల సినిమాల్లో నటిస్తూనే మిర్జాపురం రాజా వారికి రెండవ భార్యగా వెళ్ళింది.

తన పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అలా కొన్ని ఏళ్ల తర్వాత రాజావారు కాలం చేశారు. రాచరిక వ్యవస్థ అంతమవడంతో తమిళనాడు ప్రభుత్వం వీరి ఆస్తులను స్వాధీనం చేసుకుంది. దీంతో కృష్ణవేణి తమిళనాడు ప్రభుత్వం పై కోర్టులో కేసు వేసింది. అదే ప్రస్తుతం విజయవాడలో ప్రభుత్వం కట్టిన గన్నవరం ఎయిర్ పోర్ట్ భూమంతా మీర్జాపురం రాజా వారిదే. విమానాశ్రయాన్ని కట్టడానికి ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు రాజావారు.

Advertisement

also read: