Home » ‘నువ్ నాకు నచ్చావ్’ లాంటి బ్లాక్ బస్టర్ వదులుకొని కెరీర్ పోగొట్టుకున్న హీరో ఎవరంటే ?

‘నువ్ నాకు నచ్చావ్’ లాంటి బ్లాక్ బస్టర్ వదులుకొని కెరీర్ పోగొట్టుకున్న హీరో ఎవరంటే ?

by Anji
Ad

వెంక‌టేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల‌లో నువ్వునాకు న‌చ్చావ్ సినిమా ఒక‌టి. కె.విజ‌య భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దివంగ‌త న‌టి ఆర్తీ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప్ర‌కాశ్‌రాజ్‌, చంద్ర‌మోహ‌న్‌, సుహాసిని, సునీల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

Advertisement

శ్రీ‌స్ర‌వంతి మూవీస్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై డి.సురేష్‌బాబు, శ్రీ‌స్ర‌వంతి ర‌వికిషోర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ క‌థ ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు. సంగీత ద‌ర్శ‌కుడు కోటి స్వ‌రాలు అందించారు. సెప్టెంబ‌ర్ 06, 2001న ఈ చిత్రం విడుద‌లై అప్ప‌ట్లో ఘ‌న విజ‌యం సాధించింది.


ముఖ్యంగా ఈ చిత్రంలో వెంకీ-ఆర్తీ అగ‌ర్వాల్ మ‌ధ్య కెమిస్ట్రీ, కోటి అందించిన సంగీతం, విజ‌య‌భాస్క‌ర్ టేకింగ్, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు, కామెడీ సిన్స్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. సునీల్ కామెడీ కూడా అప్ప‌ట్లో పిచ్చిపిచ్చిగా హైలెట్ అయింది. దీంతో ఈ చిత్రం అప్ప‌ట్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గ రూ.18.04 కోట్ల షేర్ వ‌సూల్ చేసి నిర్మాత‌ల‌కు భారీ లాభాల‌ను మిగిల్చింది. అదేవిధంగా దేవిపుత్రుడు, ప్రేమ‌తో రా..! వంటి వ‌రుస ప్లాప్ ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వెంక‌టేష్ ఈ సినిమాతో మ‌ళ్లీ పుల్ ఫామ్‌లోకి వ‌చ్చాడు. చాలా మందికి తెలియని విష‌య‌మేమిటంటే ఈ చిత్రానికి ఫ‌స్ట్ చాయిస్ వెంక‌టేష్ కాదు అనేది.

Advertisement


తొలుత బాల‌న‌టుడిగా న‌టించిన త‌రుణ్.. విజ‌య భాస్క‌ర్ తెర‌కెక్కించిన నువ్వెకావాలితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఉషాకిర‌ణ్ మూవీస్ నిర్మించిన నువ్వెకావాలి అప్ప‌ట్లో చాలా కేంద్రాల్లో సంవ‌త్స‌రం పాటు ఆడింది. ఇది ఓ సంచ‌ల‌న విజ‌యం. ఈ సినిమాలో త‌రుణ్-రీచా జంట‌గా న‌టించారు. సాయికిర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ సినిమాకు త‌రుణ్ బెస్ట్ డ‌బ్యూహీరోగా ఫిల్మ్ ఫెయిర్ అందుకున్నాడు.

ఈ త‌రుణంలోనే విజ‌య భాస్క‌ర్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ అయిన నువ్వునాక్ న‌చ్చావ్ త‌రుణ్‌నే హీరోగా తీసుకోవాల‌ని భావించాడు. అయితే త‌రుణ్ ఇత‌ర ప్రాజెక్ట్ కార‌ణంగా రిజెక్ట్ చేశాడ‌ట‌. ఆ త‌రువాత వెంక‌టేష్‌ను హీరోగా తీసుకుని సినిమాను విడుద‌ల చేయ‌గా.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుద‌ల త‌రువాత అన‌వ‌స‌రంగా మంచి సినిమాను వ‌దులుకున్నందుకు త‌రుణ్ కాస్త బాధ‌ప‌డ్డాడ‌ట‌. అప్ప‌ట్లో నువ్వు నాకు న‌చ్చావ్ సినిమా 57 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

Also Read :  100 కోట్ల ల‌గ్జ‌రీ హెలికాప్ట‌ర్ కొన్న మొద‌టి భార‌తీయుడు.. దీని స్పెష‌ల్ ఏమిటంటే..?

Visitors Are Also Reading