ఒకప్పటి హీరోయిన్ కంటే కూడా ప్రస్తుతం పవన్ మాజీ భార్యగానే రేణుదేశాయ్ చాలా ఫేమస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తో చేసి.. ఆ తరువాత పెళ్లి చేసుకొని ఇద్దరూ పిల్లలకు తల్లి అయింది రేణు దేశాయ్. ఈమె సినిమాలకు దూరంగా ఉంది. కానీ కొన్ని కారణాలతో పవన్, రేణు దేశాయ్ విడిపోయారు. వీరు విడిపోయినా పిల్లలను మాత్రం పవన్ రెగ్యులర్ గా కలుస్తూ.. ఉంటాడు. విడిపోయి పవన్ కళ్యాణ్ వేరే వివాహం చేసుకున్నప్పటికీ.. రేణుదేశాయ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది. దీనికి ఓ రకంగా పవన్ అభిమానులు కూడా కారణమే.
Advertisement
గతంలోనే రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటే.. ఊరుకోము అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ చేసారు. విడిపోయిన తరువాత చాలా సంవత్సరాల పాటు రేణుదేశాయ్ సైలెంట్ గానే ఉంది. సినిమాలకు కూడా చాలా ఏళ్లు దూరంగా ఉన్నా.. ఇటీవలే సినిమాలు, షోలు, యాడ్స్ తో కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ.. టీవీ షోలు, యాడ్స్ చేస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ నాకు తెలిసినంత వరకు తెలుగు సినీ పరిశ్రమకు స్టైలిస్ట్ అనే కాన్సెప్ట్ పరిచయం చేసింది నేనే” అని చెప్పుకొచ్చారు.
Advertisement
“పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి చిత్రానికి నేను డైరెక్షన్ డిపార్టుమెంట్ లో వర్క్ చేశాను.ఒకసారి మేమంతా లండన్ కి వెళ్లాం. కళ్యాణ్ అక్కడ కొన్ని దుస్తుల కోసం వెతుకుతుండగా.. నేను కొన్ని కలర్ కాంబినేషన్స్ పిక్ చేసి ఇచ్చాను. ఆయనకు అవి చాలా బాగా నచ్చాయి. స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్ కి చాలా తేడా ఉంటుంది. ఖుషికి స్టైలిస్ట్ గా తొలి అడుగు వేసిన నేను.. ఆ తరువాత బాలు, గుడుంబా శంకర్, బంగారం, జల్సా వంటి చిత్రాలకు వర్క్ చేశాను” అని వెల్లడించారు.
ఇక ఆ తరువాత ఆమె బాల్యం గురించి కూడా మాట్లాడారు. “ ముఖ్యంగా నా కంటే ముందు మా ఇంట్లో ఓ ఆడపిల్ల పుట్టింది. నా తల్లిదండ్రులు అబ్బాయి పుడుతాడని ఎంతో ఆశ పడినప్పటికీ.. రెండోసారి నేను జన్మించాను. దీంతో వాళ్లు నన్ను పెద్దగా ఇష్టపడలేదు. వాళ్ల ప్రేమను పొందడం కోసం ఎక్కువ శ్రద్ధ, నిజాయితీతో ఉండేదానిని. దీంతో నా టీజేజ్ ని పెద్దగా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు నా పిల్లలకు సాధారణ లైఫ్ ని ఇవ్వడంతో పాటు క్రమశిక్షణగానూ పెంచుతున్న” అని చెప్పుకొచ్చింది రేణుదేశాయ్. రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అతి తక్కువ టైంలో వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించిన టాలీవుడ్ హీరోల లిస్టులో ఎవరు ముందున్నారంటే..?
ఖుషి నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఆరాధ్య సాంగ్ అదుర్స్..!