పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం పాలిటిక్స్ చాలా బిజీగా ఉన్నారనే చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ప్రారంభంలో దర్శకుడు కావాలని భావించాడట. అయితే కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.
Advertisement
దర్శకుడు కావాలని తొలి రోజుల్లో ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడట పవన్ కళ్యాణ్. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమిలో షార్ట్ టర్మ్ కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఓ షార్ట్ ఫిల్మ్ ని పంపారు. అంధుల గురించి షార్ట్ ఫిల్మ్ తీసిన పవన్.. న్యూయార్క్ ఫిలీం అకాడమిలో ఫీజు ఎక్కువగా ఉండటం.. ఇతర కారణాల రిత్యా కాస్త వెనుకడుగు వేశాడట. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా అడుగులు వేయాలనుకోలేదట. ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో లేదు. పవన్ షార్ట్ ఫిల్మ్ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు.
Advertisement
పవన్ రాజకీయాల కారణంగా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ.. సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కాస్త ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పవన్ మూడు సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేస్తున్న దర్శకులందరూ క్రేజ్ ఉన్న వారే కావడంతో ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారని.. పవన్ కళ్యాణ్ మూడు సినిమాల బడ్జెట్ రూ.500 కోట్లతో తెరకెక్కుతుండటంతో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ ముందు అంబానీ కూడా వేస్ట్..!
వెంకటేశ్, దగ్గుబాటి రానా అభిరామ్ ని దూరం పెట్టారా..? అసలేం అయ్యింది..?