సీనియర్ ఎన్టీఆర్ పుట్టపర్తి సాయిబాబా మధ్య గొడవలు జరిగాయనే విషయం చాలా మందికి తెలుసు. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని హిట్ సినిమాలలో కోడలు దిద్దిన కాపురం సినిమా కూడా ఒకటి. డి.యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Advertisement
ఈ సినిమాలోని సత్యనారాయణ పాత్ర పుట్టపర్తి సాయిబాబాను పోలి ఉంటుంది. పుట్టపర్తి సాయిబాబా హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ఏ విధంగా ఉంటాయో ఈ సినిమాలో సత్యనారాయణ కాస్ట్యూమ్స్, స్టైల్ అదేవిధంగా ఉంటాయి. ఈ సినిమాలో సత్యనారాయణ పాత్రను కొంతమేర నెగిటివ్ షేడ్స్ తో చూపించడం గమనార్హం.
Also Read : అలియా భట్ కొత్త కండిషన్.. తన బేబీని చూడాలంటే అది తప్పనిసరి..!!
Advertisement
ఆ సమయంలో కొంతమంది పుట్టపర్తి సాయిబాబా భక్తులు ఈ సినిమా రిలీజ్ కాకుండా చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు.సెన్సార్ బోర్డ్ సభ్యులు సైతం ఈ సినిమా రిలీజ్ కు అడ్డుపడ్డారు. ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ సొంత సినిమా కాగా.. ఆయన కోర్టుకు వెళ్లి నరసరాజు గారి సూచనల ప్రకారం.. పుట్టపర్తి సాయిబాబాను ఈ పాత్ర పోలి ఉందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారని సమాచారం. సత్యనారాయణ పాత్ర విగ్గు మాయల ఫకీర్ విగ్గు అని ఎన్టీఆర్ చెప్పడం గమనార్హం. మేం మాయల ఫకీర్ జుట్టు తీసుకున్నామని ఎన్టీఆర్ చెప్పాడని చివరకు కేసు కొట్టేశారని తెలుస్తోంది.
Also Read : యశోద సినిమాలో ఈ 5 మైనస్సులు గమనించారా..!!
సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఇక ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. కోడలు దిద్దిన కాపురం ఎన్టీఆర్ 200వ సినిమా కావడం విశేషం. అప్పట్లో సాయిబాబా భక్తులు వచ్చినా సమాధానం చెప్పగలనని సీనియర్ ఎన్టీఆర్ చెప్పారని బోగట్టా. మూఢనమ్మకాలకు సీనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకంగా ఉండేవారని సమాచారం. సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా పుట్టపర్తి సాయిబాబాను కలవలేదని తెలుస్తోంది.
Also Read : తక్కువ ఖర్చుతో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇవే..!