Telugu News » Blog » తక్కువ ఖర్చుతో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇవే..!

తక్కువ ఖర్చుతో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇవే..!

by Anji
Ads

సాధారణంగా ఏదైనా సినిమా చేయాలంటే పెట్టుబడి కచ్చితంగా పెట్టాలి. ఆ పెట్టుబడికి నిర్మాతలుండాలి. ఏ సినిమాకి తగ్గట్టు డబ్బుని ఖర్చు చేస్తుంటారు నిర్మాతలు. కొన్ని సార్లు స్టార్ హీరోలకు భారీ బడ్జెట్, మరికొన్ని సార్లు తక్కువ బడ్జెట్ ఖర్చు పెడుతుంటారు. సినిమా కథ, కంటెంట్ ని బట్టి నిర్మాతల ఖర్చు ఉంటుంది. చిన్న హీరోల సినిమాలకు తక్కువ బడ్జెట్ ఖర్చు చేసి ఎక్కువ లాభాలు పొందారు నిర్మాతలు. దీంతో వారు కోటీ శ్వరులయ్యారు. ఇంతకు ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

రన్ రాజా రన్ :

Run Raja Run : Manam News

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్-దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ రన్ రాజా రన్. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి ప్రమోద్, వంశీ కృష్ణారెడ్డి నిర్మించారు. ఈ సినిమాను రూ.4 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. ఈ సినిమా దాదాపు రూ.20కోట్ల వరకు వసూలు చేసింది.    

Also Read :  పూరి జగన్నాథ్ తమ్ముడు ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

స్వామి రారా :

Varma Hints About Sequel Of Swamy Rara - Movie News

Advertisement

సుధీర్ వర్మ దర్శకత్వంలో విడుదలైన చిత్రం స్వామి రారా. ఒక చిన్న విగ్రహం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు రూ.4 కోట్లు ఖర్చు చేయగా.. దాదాపు రూ.22 కోట్లను వసూలు చేసింది. 

Also Read :  అలియా భట్ కొత్త కండిషన్.. తన బేబీని చూడాలంటే అది తప్పనిసరి..!!

రఘువరన్ బీటెక్  :

Raghuvaran B tech : Manam News

2017లో విడుదలైన సినిమా రఘువరన్ బీటెక్. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించాడు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాకి రూ.8కోట్ల వరకు ఖర్చు చేయగా.. రూ.53 కోట్లు వసూలు చేసింది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇంకా చిన్న సినిమాలు తక్కువ పెట్టుబడితో అత్యధికంగా వసూలు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అది ఒక రకంగా నిర్మాతలకు లక్కీ అనే చెప్పాలి.  

Also Read :  సీనియర్ నటి తులసి, ప్రభాస్ శ్రీను మధ్య రిలేషన్ ఏంటి..!!

ఖైదీ :

Karthi Kaidee Manam News

లోకేశ్ కనగరాజు దర్శకత్వంలో విడుదలైన చిత్ర ఖైదీ. యాక్షన్ ఎంటర్టైనర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తమిళన నటుడు కార్తీ హీరోగా నటించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుపూర్ వివేక్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ సినిమా సుమారుగా రూ.107 కోట్ల  ని వసూలు చేసి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.  

Advertisement

Also Read :  పవన్ కళ్యాణ్ మూవీకి కొడాలి నాని డిస్ట్రిబ్యూట్ చేశాడు.. అది ఏదో తెలుసా ?

You may also like