Home » యశోద సినిమాలో ఈ 5 మైనస్సులు గమనించారా..!!

యశోద సినిమాలో ఈ 5 మైనస్సులు గమనించారా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా విడుదలైన యశోద మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అదరగొట్టాయి.. సరోగసి నేపథ్యం కథతో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్షన్ చేశారు.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి షో తోనే మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకుంది. కొంతమంది సినిమా చాలా బాగుంది అంటున్నారు మరి కొంతమంది యావరేజ్ అంటున్నారు. ఈ విధంగా టాక్ రావడానికి యశోదలో కొన్ని మైనస్ ఉన్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

1. ట్రైలర్ ను చూసి చాలా మంది సరోగసి నేపథ్యంలో సాగే మూవీ అని సర్ప్రైజ్ అయ్యారు. కానీ సినిమా మొత్తం చూసాక కంప్లీట్ గా వేరే మూవీ అనే ఫీలింగ్ కలుగుతుంది.
2. ఈ సినిమాలో లీలా పాత్ర పోషించిన దివ్య శ్రీపాద ఒక డైలాగ్ చెప్పింది. మాది తోలుబొమ్మలాడించుకునే కుటుంబం అంటూ.. అసలు తోలుబొమ్మలాటలకు కాలం చెల్లిపోయి చాలా సంవత్సరాలు అవుతోంది.. అంతేకాకుండా ఐఫోన్ గురించి గర్భం ధరించాను అని ఒక అమ్మాయి చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఏ కాలానికి చెందిన వాళ్లు అని అనుకోవాలి.

also read:టీ 20 లకు ద్రవిడ్ కోచ్ ఎందుకు ? సెహ్వాగ్ ని తీసుకోవచ్చుగా..!

3. సినిమా మొదటి భాగం 40 నిమిషాలు చాలా స్లోగా సాగుతుంది.
4. హాలీవుడ్ కు చెందినటువంటి యాక్టర్ పర్సనల్ పనిపై ఇండియాకు వచ్చి, ఎటువంటి భద్రత ఏర్పాట్లు లేని బిల్డింగులో ఉండటం.. పైగా అక్కడ సిమ్మింగ్ చేయడం అనేది లాజిక్కుకు అందని సీన్.. ఇలాంటివి చిత్రంలో చాలా వరకే ఉన్నాయి.
5. ఇక సెకండ్ హాఫ్ చాలా బాగుంది అని అనే లోపే కొన్ని యాక్షన్ సీన్స్ అనవసరంగా సాగదీశారు అనే ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా సాగదీశారు అనిపించక మానదు.

also read:తక్కువ ఖర్చుతో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading