Home » అలియా భట్ కొత్త కండిషన్.. తన బేబీని చూడాలంటే అది తప్పనిసరి..!!

అలియా భట్ కొత్త కండిషన్.. తన బేబీని చూడాలంటే అది తప్పనిసరి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ రన్బీర్ కపూర్ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే ఈ దంపతులకు నవంబర్ ఆరవ తేదీన పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఆదివారం ఉదయం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ పాప జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక గురువారం రోజున ఆస్పత్రి నుంచి ఇంటికి కూడా చేరుకున్నారు ఆలియాభట్ దంపతులు.

Advertisement

also read:బన్నీ మనసు వెన్న.. డ్రైవర్ కు ఎన్ని లక్షల సాయం చేశారంటే..?

కానీ ఇప్పటికీ ఆలియాభట్ తన బేబీని బయటకు చూపించలేదు. బేబీ ముఖాన్ని ఎవరూ చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ బాలీవుడ్ జంట. అయితే బేబీని ఇంటికి తీసుకురావడంతో తన బంధువులు,సన్నిహితులు, స్నేహితులు చూసేందుకు వస్తూ ఉన్నారు. ఇక వారి దగ్గరి బంధువులు అయితే బేబీని చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఆలియాభట్ మాత్రం తన క్యూట్ బేబీని చూడాలంటే ఒక కండిషన్ విధించింది. పాపని చూడాలంటే తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలనే కండిషన్ విధించిందట.

Advertisement

దీంతో చాలామంది బంధుమిత్రులు నిరాశకు గురవుతున్నారు. ఏది ఏమైనా అలియా భట్ పెట్టిన కండిషన్ చూసి కొంతమంది అభిమానులు మాత్రం చాలా మంచి కండిషన్ పెట్టారు అని పొగుడుతూ ఉంటే, కొంతమంది ఇలాంటి కండిషన్ పెట్టి బంధువులను, స్నేహితులను బాధపరచడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అలియా భట్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది విడుదలైన బ్రహ్మాస్త్ర పార్ట్ 1ఘనవిజయం సాధించింది.

also read:

Visitors Are Also Reading