ఒక భాషలో స్టార్ హీరోగా రాణించిన వారు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయడం సర్వసాధారణం. ఈ ఆచారం ఇటీవలి కాలంలోనే వచ్చింది కాదు… ఎప్పటినుంచో ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. పలువురు సీనియర్ హీరోలు తమ ప్రాంతీయ భాషలో సినిమాలు చేస్తూ ఇతర భాషల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా అన్ని ప్రాంతీయ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న హీరోల్లో మమ్ముట్టి కూడా ఒకరు. మమ్ముట్టి నిజానికి మలయాళంలో స్టార్ హీరోగా ఎదిగారు. ఈయన బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు.
Advertisement
తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు 400లకు పైగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ పుట్టి ఇస్మాయిల్ కాగా ఆయన స్క్రీన్ మాత్రమే మమ్ముట్టి. 1980లో మమ్ముట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులో స్వాతి కిరణం సినిమా ద్వారా పరిచయం అయ్యారు. మమ్ముట్టి తన నటనకు 13 ఫిలింఫేర్ అవార్డ్స్… 7 స్టేట్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే మమ్ముట్టి చివరగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు మమ్ముట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా మమ్ముట్టికి నటించే అవకాశం వచ్చింది. ఈ విషయం చాలామందికి తెలియదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో విలన్ రోల్ కోసం మొదట నిర్మాత అల్లుఅరవింద్ మమ్ముట్టి ని సంప్రదించారు. కానీ మమ్ముట్టి మాత్రం ఈ పాత్రకు మీరు చిరంజీవిని అడగగలరా అంటూ అల్లు అరవింద్ ను డైరెక్టుగా ప్రశ్నించారు. దాంతో అల్లు అరవింద్ అడగలేను అంటూ సమాధానమిచ్చారు. అలా మమ్ముట్టి ఈ సినిమా చేసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత జల్సా సినిమాలో విలన్ గా ముఖేష్ రుషిని తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
మన స్టార్ హీరోయిన్లు వేసుకున్న టాటూలు, వాటి వెనుకున్న అర్థాలు అవేనా ?
సర్కారు వారి పాట స్టొరీ లీక్….ఇదే నిజమైతే ఈ సినిమా కూడా…!