Home » మన స్టార్ హీరోయిన్లు వేసుకున్న టాటూలు, వాటి వెనుకున్న అర్థాలు అవేనా ?

మన స్టార్ హీరోయిన్లు వేసుకున్న టాటూలు, వాటి వెనుకున్న అర్థాలు అవేనా ?

by AJAY

ఒకప్పుడు వ్యాధుల బారిన పడకుండా పచ్చబొట్లు వేయించుకునే వారు. ఇప్పుడు వాటినే టాటూలు అని పిలుస్తున్నారు. ప్రస్తుతం యువత ఎక్కువగా టాటూలు వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా టాటూ వేసుకోవడంలో సెలబ్రిటీ లో ముందుంటున్నారు. అందుల కూడా ఎక్కువగా హీరోయిన్లు టాటూలకు ప్రాధాన్యత ఇస్తారు. మన టాలీవుడ్ లోనూ చాలా మంది హీరోయిన్లు టాటూలు వేసుకున్నారు. అయితే వారి టాటూ వెనక ఎన్నో అర్థాలు కూడా ఉన్నాయి. హీరోయిన్లు ఎక్కడ టాటూ వేసుకున్నారు. దాని అర్థం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.

Samantha

టాలీవుడ్ బ్యూటీ సమంత ఏకంగా మూడు టాటూలు వేసుకుంది. అందులో ఒకటి మెడ వెనక భాగంలో ఉంటుంది. వైఎంసి అని కనిపించే ఈ టాటూకు “యుఆర్ మై చయ్” అని అర్థం. అదేవిధంగా సమంత కుడి చేతి పై రోమన్ సింబల్ తో కూడా టాటూ ఉంటుంది. అదేవిధంగా సమంత నడుము పై గులాబీ మొగ్గ టాటూ ఉంటుంది.

గోవా బ్యూటీ ఇలియానా శరీరం పై రెండు టాటూలు ఉంటాయి. అందులో ఒకటి మణికట్టు పైన ఉంటుంది. ఇన్స్పైర్ అని లాటిన్ భాషలో ఆ టాటూ కనిపిస్తోంది. మరొకటి చేతి భాగంలో ఉంటుంది అందులో రెండు చుక్కలు మధ్యలో ఒక వృత్తం ఉంటాయి. ఇది తన ఫ్యామిలీని సూచిస్తుంది.

ఝుమ్మంది నాదంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్ లో తాప్సీ ఫుల్ బిజీగా ఉంది. తాప్సీ కాలిపై డ్యాన్సింగ్ గర్ల్ టాటూ ఉంటుంది.

ఒకప్పటి హీరోయిన్ మహేష్ బాబు సతీమణి నమ్రత చేతిపై హిందీ లో టాటూ ఉంటుంది. ఆ టాటూలో మహేష్ బాబు, గౌతమ్, సీతారల పేర్లు ఉంటాయి.

టాలీవుడ్ భామ త్రిష ఎదపై టాటూ వేసుకుంది. డిస్నీ క్యారెక్టర్ నెమోను త్రిష టాటూ వేసుకుంది. అంతేకాకుండా దిశా చేతిపై వృషభరాశి గుర్తును మరో టాటూగా వేసుకుంది. మూడో టాటూ ఎడమ భుజంపై ట్రైపాడ్ విత్ కెమెరాను వేసుకుంది.

జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఎద పై టాటూ తో అందర్నీ అవ్వక్కయ్యేలా చేసింది. అనసూయ ఎద పై ఉన్న టాటూ నిక్కు…అది అనసూయ భర్త నిక్ నేమ్.

నేషనల్ క్రష్ రష్మిక తన చేతుపై “ఇర్రిప్లేసబుల్” అనే టాటూ వేసుకుంది. దాని అర్థం ఆమె వ్యక్తిత్వానికి సూచన అట.

Also read : 2021 SUPER HIT MOVIE’S : చిన్న సినిమాలే కానీ భారీ విజయాలు..!

 

Visitors Are Also Reading