Home » జగదేకవీరుడు అతిలోకసుందరిలో మెగాస్టార్ రెమ్యూనరేషన్ రికార్డ్ అని తెలుసా..?

జగదేకవీరుడు అతిలోకసుందరిలో మెగాస్టార్ రెమ్యూనరేషన్ రికార్డ్ అని తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. మధ్యలో కొన్ని సంవత్సరాల గ్యాప్ ఇచ్చిన ఆయన ఖైదీ నెంబర్ 150 మూవీతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి ఇలాంటి చిత్రంలో చేసే చారిత్ర ఉన్న పాత్రలో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య మూవీతో రికార్డు క్రియేట్ చేశారు.

Advertisement

Also Read:చిరు రిక్షావోడు మూవీతో ఆమనికి అన్యాయం..ఆ డైరెక్టర్ వల్లేనా..?

అలాంటి చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా సోషియో ఫాటసీ కథాంశంతో తెరికెక్కింది. అప్పట్లో తిరుగులేని హీరోయిన్ గా ఉన్న శ్రీదేవి చిరు సరసన చేసింది. ఈ సినిమా రిలీజ్ అయి మూడు దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ టీవీలో చూస్తే కొత్తగా చూసినట్టే అనిపిస్తుంది. ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన మొదటివారం థియేటర్ వైపు చూడలేదట.

Advertisement

Also Read:సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

వారం గడిచిన తర్వాత ప్రతిరోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయిందట. నెల రోజులు అయ్యేసరికి టికెట్టు దొరకడం కూడా కష్టంగా మారిందని వందరోజుల నుంచి 200 రోజులు కొన్ని థియేటర్లలో సంవత్సర కాలం పాటు ఆడిందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవికి ఆ టైంలోనే 35 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. అప్పట్లో అది చాలా ఎక్కువ. శ్రీదేవికి కూడా 25 లక్షలు ఇచ్చారని, మూడు దశాబ్దాల కిందటి విషయాన్ని చూస్తే ఇప్పట్లో ఆ అమౌంటు కోట్లలోనే ఉంటుందని అనుకుంటున్నారు.

Also Read:44 బంతుల్లోనే సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఆటగాడు..!

Visitors Are Also Reading