Home » బాల‌కృష్ణ ఆ హీరోయిన్ ని ల‌వ్ చేశాడ‌నే విష‌యం మీకు తెలుసా..?

బాల‌కృష్ణ ఆ హీరోయిన్ ని ల‌వ్ చేశాడ‌నే విష‌యం మీకు తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అత‌ను ఏది చేసిన అదో ట్రెండ్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం క‌లిగి బాల‌య్య త‌న‌కు ఏది అనిపిస్తే అది చేస్తుంటారు. ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య త‌న 107వ ఫిల్మ్ చేస్తున్నారు. బాల‌య్య వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికొస్తే.. త‌న బంధువుల అమ్మాయి అయిన వ‌సుంధ‌ర‌ను పెళ్లి చేసుకున్న విష‌యం విదిత‌మే. కానీ బాల‌కృష్ణ‌కు ఒక ల‌వ్ స్టోరీ కూడా ఉందండోయ్‌.. ఓ హీరోయిన్ ను సిన్సియ‌ర్ గా ల‌వ్ చేశార‌ట. ఇక ఆ త‌రువాత ఏం జ‌రిగిందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


నంద‌మూరి తార‌క రామారావు వార‌సుడిగా అటు రాజ‌కీయాల్లో ఇటు సినిమాల్లో కొన‌సాగుతున్నారు బాల‌కృష్ణ‌. హిందూపురం ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తూనే ప్ర‌ముఖ సినీ న‌టుడిగా సినిమాలు చేస్తున్నారు. బాల‌య్య ల‌వ్‌స్టోరీ విష‌యానికొస్తే.. ఆయ‌న హీరో అయిన కొత్త‌లోనే బాగా రాణించారు. బాల‌య్య న‌టించిన సినిమాలు వ‌రుస‌గా విజ‌యాల‌ను అందుకున్నాయి. ఈ త‌రుణంలోనే మ‌ద్రాస్‌కి చెందిన ఓ హీరోయిన్ ను బాల‌య్య సిన్సీయ‌ర్ గా ల‌వ్ చేశార‌ట‌. ఈ విష‌యం త‌న తండ్రి ఎన్టీఆర్‌, అన్న హ‌రికృష్ణ‌ల‌కు తెలిసింది. దీంతో వారు కాకినాడ‌కు చెందిన బంధువుల అమ్మాయి అయిన‌టువంటి వ‌సుంధ‌ర‌ను బాల‌కృష్ణ‌కిచ్చి పెళ్లి జ‌రిపించార‌ట‌.

Advertisement

Advertisement

తాను నిజంగానే చెన్నైకి చెందిన ఓ హీరోయిన్ ని ల‌వ్ చేశాన‌ని.. త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న వారితో బాల‌య్య చెప్పాడ‌ట‌. ఈ విష‌యాల‌ను స్వ‌యంగా బాల‌య్య ఇంట‌ర్వ్యూలో చెప్పేవారు. రాజ‌కీయ నాయ‌కుడు నాదెండ్ల భాస్క‌ర్ రావు కూడా బాలయ్య ఓ హీరోయిన్ ని ల‌వ్ చేశాడ‌ని చెప్పుకొచ్చారు. అయితే ఈ విష‌యం అప్పుడ‌ప్పుడు సెట్‌లో కొంత మందితో పంచుకున్నారని తెలుస్తోంది. బాల‌కృష్ణ సినిమాల‌కు కాస్ట్యూమ్ విభాగంలో ప‌ని చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ‌రాపాక ఆ హీరోయిన్ పేరు మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. కానీ ల‌వ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. అప్ప‌ట్లో టాక్ వినిపించిన హీరోయిన్ కుష్బూ అని అనుకున్నార‌ట‌. ఇక బాల‌య్య సినిమాల విష‌యానికొస్తే ఇటీవ‌లే అఖండ సినిమాతో అఖండ విజ‌యాన్ని అందుకున్నారు. త‌న త‌దుప‌రి సిమాల కోసం నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాల‌య్య న‌టించే 107 ఫిల్మ్ కి జై బాల‌య్య అనే టైటిల్ ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. చిత్ర యూనిట్ మాత్రం ఇంకా టైటిల్ ప్ర‌క‌టించ‌లేదు.

Also Read : 

బింబిసార ఫ‌స్ట్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?

ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో ఎవరెవరు ఏమని పిలిచేవారో తెలుసా..? అన్నగారు అని ఎందుకు పిలిచే వారంటే…?

 

Visitors Are Also Reading