ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన పుష్ప సినిమా విజయాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన కెరీర్‌నే మలుపు తిప్పిన సినిమా అంటే పుష్ప అనే చెప్పాలి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇక తాజాగా సైమా అవార్డు వేడుకలో కూడా పుష్ప హవా కొనసాగించింది. ఏకంగా పుష్ప సినిమా 6 అవార్డులను కైవసం చేసుకుంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు బన్నీ.
Advertisement
అయితే కెరీర్ ప్రారంభంలో బన్నీ ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించాడనే విషయం మీకు తెలుసా..? అది కూడా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలోనే కావడం విశేషం. ఐయామ్ దట్ చేంజ్ అనే శీర్షికతో ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎనిమిది సంవత్సరాల కిందట సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఐయామ్ దట్ చేంజ్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాతగా కూడా వర్క్ చేశాడు. మూడు నిమిషాల నిడివి కలిగి ఉన్న ఈ షార్ట్ ఫిలింలో మన కర్తవ్యాలు నిర్వర్తించడం కూడా దేశభక్తి. మార్పు మనతోనే మొదలవుతుంది.
Advertisement
ఇది కూడా చదవండి : అసలు నా కూతురివి కాదంటూ.. అన్షుపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన రోజా.. అలా ఎందుకు మాట్లాడిందబ్బా..!!
ఆ మార్పు నేనే అలా మారండి అని చెప్పారు. ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన తరువాత షార్ట్‌ఫిల్మ్ మేకర్స్ అంటే తనకు సరికొత్త గౌరవం వచ్చిందని బన్నీ పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సామాజిక అవగాహన ప్రకటనలను మంచి ఉద్దేశంతోనే రూపొందించడం చూశాను. వారి ఉద్దేశ్యాలు చాలా గొప్పవి. కొన్ని సార్లు ఈ వాణిజ్య ప్రకటనలు అంతగా ప్రభావం చూపించవు. నా అభిమానులు, స్నేహితులు, విద్యార్థులు ఇలా చాలా మంది తమదైన శైలిలో సమాజానికి సేవ చేస్తున్నారు. నేను కూడా ఈ సమాజానికి ఏదైనా చేయాలనుకున్నాను. అప్పుడే ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాను అంటూ గతంలో చెప్పారు అల్లు అర్జున్.
ఇది కూడా చదవండి : చార్మి-పూరీ మధ్య పెరిగిన దూరం..వారి మధ్య వైరానికి అసలు కారణం ఇదేనా..?