సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలు, హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో అయితే నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్‌లో మొదటి వారసత్వాన్ని మొదలుపెట్టిన ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో హరికృష్ణ, బాలకృష్ణలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
Advertisement
ఈ కుటుంబం నుంచి వచ్చిన ప్రతీ హీరో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కేవలం తన కొడుకులను మాత్రమే కాకుండా తన తమ్ముడు త్రివిక్రమరావు తనయుడు నందమూరి కళ్యాణ చక్రవర్తిని కూడా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
కోడిరామకృష్ణ దర్శకత్వంలోని స్వాగతం సినిమాలో నటించి తొలిసారి 1986లో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రెండో సినిమాగా అదే ఏడాది తలంబ్రాలు విడుదల అయింది. రెండు సినిమాలకు వరుసగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించడంతో ఈ నందమూరి హీరో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా ఈయన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 1986 సంవత్సరంలోనే 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ హీరో కు కూడా ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదు.
Advertisement
ఇక 1987లో చక్రవర్తి నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి. 1988లో రెండు సినిమాల్లో నటించిన తరువాత చక్రవర్తి కనిపించకుండా పోయాడు. దాదాపు 15 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 2003లో కబీర్‌దాస్ సినిమాలో కనిపించాడు. 1988, 1989 ఏడాదిలో తన తండ్రి త్రివిక్రమ్‌రావు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సినిమాలు సరిగ్గా చేయలేకపోయాడు. ఇక జనాలతో పాటు ఫిల్మ్ మేకర్స్ కూడా కళ్యాణ చక్రవర్తిని మరిచిపోయారు. కళ్యాణ చక్రవర్తి చూడడానికి పెద్దనాన్న ఎన్టీఆర్‌ను పోలి ఉన్నప్పటికీ దురదృష్టావశాత్తు ఇండస్ట్రీలో ఎదిగే అవకాశాన్ని అనూహ్యంగా కోల్పోయాడు. ప్రస్తుతం వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు.
Also Read :
24 ఇడ్లీలు, 30బజ్జీలు…ఎన్టీఆర్ ఫుడ్ మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
చిరంజీవి కూతురు శ్రీజ మూడో పెళ్లి గురించి ఆ సీనియర్ నటి ఏమన్నదంటే..?