Home » క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీకు తెలుసా ?

క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా చికెన్ తో రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు. కర్రీస్, పచ్చడి, స్నాక్స్ ఇలా చికెన్ తో చేసే లిస్ట్ చాలానే ఉంటుంది. చికెన్ తో ఏం చేసినా ఆ టేస్ట్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. చికెన్ తో చేసే ఐటెమ్స్ లో చికెన్ పాప్ కర్న్ కూడా ఒకటి. రెస్టారెంట్స్, హోటల్స్, దీనిని ఎంతో ఇష్టంగా తింటుటారు. ఎప్పుడూ బయటే కాకుండా ఒక్కోసారి చాలా ఇష్టంగా తింటుంటారు. ఎప్పుడూ బయటే తినకుండా ఒక్కసారి ఇంట్లో కూడా  ట్రై చేయండి. అస్సలు వదిలి పెట్టరు. వీకెండ్స్ లో లేదా ఇంట్లో ఏమైనా స్పెష్పల్ డేస్ లో క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేశారంటే.. మళ్లీ మళ్లీ చేయమంటారు. మరి ఇంట్లో క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

కావాల్సిన పదార్థాలు : 

 చికెన్, మైదా పిండి, కోడి గుడ్డు, ఉప్పు, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, లైట్ సోయా సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, బ్రెడ్ క్రంబ్స్, పాప్రికా, నూనె. 

తయారీ చేయు విధానం : 

Advertisement

ముందుగా చికెన్ ని అర గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఓ లోతు గిన్నెలోకి తీసుకోవాలి. వీటిలో ఉప్పు, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, లైట్ సోయా సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా మ్యారినేట్ చేసు కోవాలి. ఇప్పుడు ఇందులో సగం గుడ్డు, కొద్దిగా మైదా పిండి వేసుకుని కలుపు కోవాలి. అవసరం అయితే కొద్దిగా నీటిని యాడ్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని.. వీలైతే రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచాలి. లేదంటే కనీసం రెండు గంటలైనా మ్యారినేట్ చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

చికెన్ ని తీసి కాసేపు అలానే ఉంచాలి. ఈ లోపు ఒక ప్లేట్ లోకి బ్రెడ్ క్రంబ్స్ లో కొద్దిగా పాప్రికా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక్కో చికెన్ పీస్ ని బ్రెడ్ క్రంబ్స్ లో వేసి బాగా కోటింగ్ ఇచ్చు కోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక.. చికెన్ పీసెస్ ని ఆయిల్ లో వేసి గోల్డన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకొని.. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా తయారైన చికెన్ ని టమాటా కిచప్ లేదా మైనీస్ తో తింటే భలే టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ని మీరు కూడా ట్రై చేసి చూడండి. 

Visitors Are Also Reading