Home » మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ‘రాఘవేంద్ర’ మూవీలో సెకండ్ హీరోయిన్ గుర్తుందా ?

మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ‘రాఘవేంద్ర’ మూవీలో సెకండ్ హీరోయిన్ గుర్తుందా ?

by Bunty
Ad

 

శ్వేత అగర్వాల్ ఈ అమ్మడు పేరు చెబితే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ అల్లరి సినిమాలో అప్పు అంటే టక్కున గుర్తుపడతారు. అప్పు పాత్రలో ఈ అమ్మడు చాలా అద్భుతంగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అల్లరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ని ప్రారంభించింది. ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Do you know how the second heroine of Prabhas Raghavendra’s movie is now

ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఎంతో సాంప్రదాయంగా కనిపించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా కొన్ని సినిమాల్లో నటించింది. శ్వేత చివరగా షాపిత్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ శ్వేతాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక శ్వేత ఇండస్ట్రీకి 13 ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు.

Advertisement

Advertisement

ఆ తర్వాత 2020లో సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ ను వివాహం చేసుకుంది. ఇక వీరికి ఒక పాప జన్మించింది. వివాహా అనంతరం తన పూర్తి లైఫ్ ను కుటుంబంతో లీడ్ చేస్తోంది. ప్రస్తుతం శ్వేత కాస్త బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading