Home » వెయ్యి ఏళ్ల కిందట భారత్ లో కట్టుబాట్లు ఎలా ఉండేవో తెలుసా ?

వెయ్యి ఏళ్ల కిందట భారత్ లో కట్టుబాట్లు ఎలా ఉండేవో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ప్రపంచ దేశాల్ల అన్నింటికంటే కూడా భారతదేశానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశంలో భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, విభిన్న మతాలు అందరూ కలిసి మెలిసి ఉండే విధానం ఒక్కటేమిటీ ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్న కట్టుబాట్లు ఎక్కడ లేవనే చెప్పాలి.  భారతదేశంలో పుట్టిన  చాలా రకాల సంప్రదాయాలు, కట్టుబాట్లను ప్రపంచ దేశాలు అన్ని కూడా పాటిస్తున్నాయి. వెయ్యేళ్ల కిందటే భారతదేశ చరిత్ర ప్రారంభం అయిందని.. చెప్పడానికి పలు ఆధారాలున్నాయి.

Advertisement

పాతకాలంలో కేవలం ఆహారం కోసం మాత్రమే పని చేసేవారు. ఆహారాన్ని సంపాదించుకునేందుకు వీరు కష్టపడేవారు.  బ్రతకడం కోసం వ్యవసాయం చేసేవారు. కానీ అప్పట్లో వ్యవసాయం చేయడానికి అస్సలు పనిముట్లు ఉండేవి కాదు. దీంతో పంట తీయడానికి సంవత్సరమంతా కష్టపడేవారు. ఆ తరువాత చిన్న చిన్నగా పని ముట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కొత్త పనిముట్లను తయారు చేయడం.. ఆధునీకరణ పెరగడంతో ఆ తరువాత ఏడాదికి రెండు పంటలను పండించేవారు. వరి, పత్తి లాంటివి ఎక్కువగా పండించేవారు. ఆ తరువాత ఎద్దులనుపయోగించి వ్యవసాయం చేయడం.. ఆ తరువాత వివిధ వ్యవసాయ పనిముట్ల అందుబాటులోకి రావడంతో కొంత సులువు అయింది. ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ రోజు  రోజుకు విపరీతంగా పెరిగిపోయింది. అయినప్పటికీ కొన్ని కట్టుబాట్లు మాత్రమే అలాగే కొనసాగుతున్నాయి. వాటిలో ఒకటి వస్త్రాధారణ.. అప్పటికీ, ఇప్పటికీ వస్త్రధారణలో ఎలాంటి మార్పులు మాత్రం రాలేదు. పాతకాలంలో మహిళలు చీరలను ధరించేవారు.

Advertisement

ఇప్పటికీ మహిళలు చీరలను ధరిస్తూనే.. కొన్ని ఫ్యాషన్ డ్రెస్ లు కొంత మంది మాత్రం ధరిస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. పురుషులు కూడా దోవతిని గోచి పెట్టుకునేవారు. పైన షర్ట్ ధరించేవారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఆ ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రస్తుతం చిన్నపిల్లలు కొంత మంది ఏదైనా ఫంక్షన్ల సమయంలో గోచి వంటి దుస్తులను ధరిస్తున్నారు. చాలా వరకు ఇప్పుడు విదేశీయుల మాయలో పడి చీరలను పక్కకు పెట్టి డ్రెస్ లు ధరిస్తున్నారు. పురాతన కాలంలో స్వయంగా పండించుకున్న ఆహారాన్ని మాత్రమే తినేవారు. కానీ ఇప్పుడు పండించే వారు తక్కువగా.. తినే వారు ఎక్కువగా ఉండటం వల్ల ప్రతీ వస్తువు కూడా కల్తీమయమవుతుంది. పాతకాలంలో ఏ జబ్బు వచ్చినా ఆయుర్వేదం ద్వారా నయం చేసుకునేవారు. అడవిలో దొరికే వనమూలికలు, పసలు ద్వారానే ఏ రోగాన్ని అయినా నయం చేసుకునేవారు. కొంత మంది అయితే ఇప్పటికీ ఆయుర్వేద పద్దతులను పాటిస్తున్నారు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

యాంకర్ ప్రదీప్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

Tamanna: ఉపాసన అసలు ఏ డైమండ్ రింగ్ ఇవ్వలేదు… ఆ ఫోటో వెనుక అసలు విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు!

Visitors Are Also Reading