Home » ‘క్యాష్’ ప్రోగ్రామ్‌కి సుమ రెమ్యున‌రేష‌న్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా..?

‘క్యాష్’ ప్రోగ్రామ్‌కి సుమ రెమ్యున‌రేష‌న్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా..?

by Anji
Ad

ఈటీవీలో సుదీర్ఘ‌కాలంగా ప్ర‌సార‌మ‌వుతున్న క్యాష్ కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టికీ భారీ ఎత్తున అభిమానులు ఉన్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. చాలా సంవ‌త్స‌రాలుగా ఒక రియాల్టీ షో ఇలా కొన‌సాగ‌డం అనేది మామూలు విష‌యం కాదు. సుమ యాంక‌రింగ్ అవ్వ‌డం వ‌ల్ల‌నే కార్య‌క్ర‌మం ఇంత కాలం కొన‌సాగుతుందంటూ ప్ర‌తీ ఒక్క‌రూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

కేవ‌లం సుమ ఉండ‌డం వ‌ల్ల‌నే క్యాష్ ప్రోగ్రామ్‌ని చూస్తున్నామ‌ని కొంద‌రూ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్త ప‌రిచడం విశేషం. ప్ర‌తి వారం సెల‌బ్రిటీల‌ను తీసుకొచ్చి వారితో ఆట‌లు ఆడిపిస్తూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పండిస్తున్న క్యాష్ కార్య‌క్ర‌మానికి సుమ చాలా క‌ష్ట‌ప‌డుతుంది. ఎన్నో డైలాగ్‌ల‌ను గుర్తు పెట్టుకుంటూ వ‌చ్చిన కంటెస్టెంట్స్ ని మేనేజ్ చేస్తూ ప్ర‌తీ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుంటుంది. అందుకే ఈ స్థాయిలో రేటింగ్ రావ‌డంతో పాటు ఇన్నాళ్ల నుంచి కొన‌సాగుతోంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  “నువ్వునాకు న‌చ్చావ్” పింకీ జీవితంలో ఇంత విషాదం ఉందా..? అది తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు..!

Advertisement


సుమ ఇంత‌గా క‌ష్ట‌ప‌డుతుంది. అంతా బాగానే ఉంది. కానీ సుమ పారితోషికం ఇస్తుంటారు అని చాలా మంది అనుకోవ‌చ్చు. కానీ క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఒక్క ఎపిసోడ్‌కు సుమ రూ.5ల‌క్ష‌లు పారితోషికం తీసుకుంటుంద‌ట‌. 5 ల‌క్ష‌ల‌తో పాటు త‌న స్టాప్ ఖ‌ర్చులు అద‌నం అవి ఒక రూ.50వేల వ‌ర‌కు ఖ‌ర్చుఅవుతుంటాయి. మొత్తానికి ఐదున్న ల‌క్ష‌లు ఎపిసోడ్‌కి తీసుకుంటుందంటూ స‌మాచారం. సుమ క్యాష్ ప్రోగ్రామ్‌కి ప్రారంభంలో ఒక్కో ఎపిసోడ్‌కి రూ.50వేల నుంచి 70 వేల వ‌ర‌కు పారితోషికం తీసుకునేద‌ట‌. ఇప్పుడు ఆమె పారితోషికం ఎన్ని రెట్లు పెరిగిందో మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఇది కూడా చ‌ద‌వండి :  విడాకుల త‌ర‌వాత మ‌నోజ్ మొద‌టి భార్య ఎక్క‌డ ఉందో..? ఏం చేస్తుందో తెలుసా..?


క్యాష్ కార్య‌క్ర‌మం కాకుండా ఆమె ఏ కార్య‌క్ర‌మం చేసినా ఇంత‌కు మించి పారితోష‌కం వ‌స్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆమెకు క్యాష్ కార్య‌క్రమంతో ఒక అనుబంధం ఉంది. త‌న‌ను యాంక‌ర్ గా నిల‌బెట్టి ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టింది కాబ‌ట్టి మ‌ల్లెమాల, ఈటీవీని వ‌దిలీ ఆమె బ‌య‌టికి వెళ్ల‌దు. అందుకే క్యాష్ కార్య‌క్ర‌మం ఆమె రెగ్యుల‌ర్‌గా చేస్తూనే ఉంటుంది. ఆమె చేయ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కులు రెగ్యుల‌ర్‌గా చూస్తూనే ఉంటారు. మ‌రో 10 సంవ‌త్స‌రాలు అయినా క్యాష్ కార్య‌క్రమం వ‌స్తూనే ఉంట‌ది.. ప్రేక్ష‌కులు చూస్తూనే ఉంటారు. యాంక‌ర్ సుమ కొన‌సాగితూనే ఉంటుంది. సుమ ఎప్పుడైతే చేయ‌లేనంటూ క్యాష్ కార్య‌క్ర‌మాన్ని వ‌దిలేస్తుందో అప్ప‌టివ‌ర‌కు మ‌ల్లెమాల వారు క్యాష్ కార్య‌క్ర‌మాన్ని చేస్తారు అనేది బుల్లితెర వ‌ర్గాల టాక్.

ఇది కూడా చ‌ద‌వండి :  టాలీవుడ్ నంబ‌ర్ 1 హీరో ప్ర‌భాస్..! హీరోయిన్ ఎవ‌రంటే..?

Visitors Are Also Reading