Telugu News » Blog » టాలీవుడ్ నంబ‌ర్ 1 హీరో ప్ర‌భాస్..! హీరోయిన్ ఎవ‌రంటే..?

టాలీవుడ్ నంబ‌ర్ 1 హీరో ప్ర‌భాస్..! హీరోయిన్ ఎవ‌రంటే..?

by AJAY
Ads

సినిమా ఇండ‌స్ట్రీలో నంబ‌ర్ 1 స్థానంలో ఉండాల‌ని హీరోహీరోయిన్ లు ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటారు. అయితే నంబ‌ర్ 1 స్థానంలో ఉండ‌టం అనేది అంత సులువైన విష‌యం కాదు. క‌ష్టంతో పాటూ క‌థ‌ల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా ఉండాలి. దాంతో పాటూ అదృష్టం కూడా ఉండాలి. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో ఎవ‌రని అడిగితే ఖ‌చ్చితంగా చెప్ప‌లేం కానీ కొన్ని లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌భాస్ టాలీవుడ్ లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నారు.

Ads

బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. అంతే కాకుండా ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ కూడా మిగితా టాలీవుడ్ హీరోల కంటే డ‌బుల్ తీసుకుంటున్నారు. ఒక్కో సినిమాకు ప్ర‌భాస్ ఏకంగా 120 కోట్ల వ‌ర‌కూ పుచ్చుకుంటున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ తో సినిమా చేస్తే వెయ్యి కోట్లు ప‌క్కా అని నిర్మాత‌లు కూడా భావిస్తున్నార‌ట‌. అందుకే 120 కోట్ల రెమ్యున‌రేష్ ఇచ్చేందుకు వెన‌కాడ‌టం లేదట‌.

Ads
Ad

ఇక ప్ర‌భాస్ టాలీవుడ్ నుండి అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన హీరోగా నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ వెల్ల‌డించింది. ఆ సంస్థ ప్ర‌తినెలా స‌ర్వే నిర్వ‌హిస్తుంది. ఆ స‌ర్వే ప్ర‌కారం ప్ర‌భాస్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నారు. అంతే కాకుండా ప్ర‌భాస్ త‌ర‌వాత రెండు మూడు స్థానాల్లో ఎన్టీఆర్ మ‌రియు అల్లు అర్జున్ లు ఉన్నారు. ఇక హీరోయిన్ ల విష‌యానికి వ‌స్తే సమంత నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నారు. అంతే కాకుండా కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రియు అనుష్క‌లు రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.