దర్శక ధీరుడు రాజమౌళిక తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరమే లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఆర్ఆర్ఆర్ భారత్ తరుపున ఆస్కార్ అవార్డుకి వెళ్తుందని అందరూ భావించినప్పటికీ భారత ప్రభుత్వం గుజరాత్ కి చెందిన ఛల్లో షో ని ఆస్కార్ కి నామినేట్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా అందరూ ఊహించినవిధంగానే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నాడు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి.
Advertisement
భారత సినీ చరత్రలో ఇది మరుపు రాని అధ్యాయం. ఆస్కార్ కి రెండడుగుల దూరంలో ఉంది ఆర్ఆర్ఆర్ టీమ్. జనవరి 24న ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ విడుదల కానుంది. అందులో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకు చోటు ఖాయమని గోల్డెన్ గ్లోబ్ అవార్డు నిరూపించింది. దీంతో పాటు ఇతర కేటగిరిలలో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా చోటు దక్కించుకుంటుందనే ఆశాభావంతో ఉంది చిత్ర యూనిట్. వాస్తవానికి ఆస్కార్ గడప తొక్కాలంటే అంత తేలికైన విషయమేమి కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పనే. అంత ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. భారతీయ సినిమాల రూపర్తలు తమ సినిమాలపై నమ్మకం ఉన్నా ఆ సాహసానికి ముందుకెళ్లరు. కానీ రాజమౌళి తన సినిమాల రూపకల్పన విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా, నిబద్ధతతో ఉంటాడో ప్రచారం విషయంలో కూడా అదేవిధంగా దృఢ సంకల్పంతో ఉంటాడు.
Advertisement
ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి వచ్చిన అప్లాజ్, ప్రధానమైన భాషలలో బాక్సాఫీస్ వద్ద లభించిన ఆదరణ, ప్రేక్షకుల ప్రోత్సాహంతో పాటు విమర్శకుల ప్రశంసలు తనను ఆస్కార్ వైపునకు అడుగులు పడేవిధంగా చేశాయి. దీనికి తోడు రాజమౌళికి ఉన్నటువంటి మార్కెటింగ్ నైపుణ్యం బాగా కలిసొచ్చింది. ఆస్కార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని పక్కా ప్లాన్ తో రాజమౌళి రంగంలోకి దిగాడు. ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. భారత్ తరుపున ఆర్ఆర్ఆర్ కి కాకుండా వేరే సినిమాకి ఆస్కార్ ఎంట్రీ దక్కినా అది నెరవేరలేదు. ఇలాంటిది జరుగుతుందని ముందస్తుగానే ఊహించి తన సినిమా ఆస్కార్ ముంగిట నిలవాలంటే ఏం చేయాలో చకచకా చేసుకుంటూ పోయాడు. ఇక ఈ ప్రాసెస్ మొత్తానికి భారీ స్థాయిలో వ్యయం ఖర్చయింది. ఈ బడ్జెట్ తో ఓ మీడియం సినిమా కూడా తీయవచ్చు.
ప్రస్తుతం డాలర్ ధర రూ.81 వరకు ఉన్నది. అమెరికన్ డాలర్లలో చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి ప్రమోషన్స్ కి 6 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం.. దాదాపు రూ.50 కోట్ల వరకు ఖర్చు అయిందన్న మాట. భారతదేశంలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కోసం ప్రచారం కోసం రూ.20కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. దాని కంటే దాదాపు రెండు రెట్లకు పైగా ఆస్కార్ ప్రచారం కోసం ఖర్చయింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీ సాధించి ఏ కేటగిరిలో అయినా అవార్డు సాధిస్తే అది మన యావత్ భారతదేశానికే గర్వకారణమవుతుంది. ఇప్పటివరకు ఆస్కార్ గెలుచుకున్న మన భారతీయులు ఆంగ్లేయులు నిర్మించిన సినిమాలతోనే అందుకున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అందుకున్నా.. రేపు ఆస్కార్ దక్కించుకున్నా అది అరుదైన రికార్డే అవుతుంది. ఈ అరుదైన రికార్డు సాధించి మన తెలుగువారి సత్తా ప్రపంచం మొత్తం తెలిసేలా చేయాలని కోరుకుందాం.
Also Read : వీరసింహారెడ్డి సినిమా గురించి తమన్ ఏమన్నారో తెలుసా ?