Home » వీరసింహారెడ్డి సినిమా గురించి తమన్ ఏమన్నారో తెలుసా ?

వీరసింహారెడ్డి సినిమా గురించి తమన్ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

గాడ్ ఆఫ్ మాసస్, నందమూరి నటసింహ బాలకృష్ణ తాజా మూవీ వీరసింహారెడ్డి. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల భారీగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ మేకర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే వీరసింహారెడ్డి ఆల్బమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

Advertisement

టాప్ ఫామ్ లో ఉన్నటువంటి తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మాబావ మనోభావాలు, మాస్ మొగుడు సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈమూవీ గురించి తమన్ ఓ ఇంటర్వ్యూలో  పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. వీరసింహారెడ్డి సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశామని, బాలయ్య గారి కల్ట్ మూవీ అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బాలయ్య ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ఎంత అభిమానిస్తున్నారో వీరసింహారెడ్డి ఫలితమే చెబుతుందన్నారు. వీరసింహారెడ్డికి అఖండతో అసలు పోలిక లేదు. ఇందులో ఎమోషనల్, సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుంది.

Advertisement

Also Read :  వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్ గా మారడానికి కారణం ఏంటో తెలుసా ?

గోపిచంద్ మలినేని బాలకృష్ణ గారి అభిమాని కావడంతో ఓ అభిమాని ఎలా కోరుకుంటాడో అలాగే అద్బుతంగా తెరకెక్కించారు. అదేవిధంగా నేపథ్య సంగీతం కూడా చాలా బాగా వచ్చిందని వెల్లడించారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. రెండు పాత్రలను కూడా దర్శకుడు చాలా బాగా డిజైన్ చేసాడు. దర్శకుడు మంచి సినిమా తీస్తేనే తాను మంచి మ్యూజిక్ అందించగలను. ఒక సినిమాకి బేస్ మెంట్ దర్శకుడే. గోపిచంద్ అద్భుతంగా తీయడం వల్లనే తనకు మంచి సంగీతమందించే అవకాశం లభించింది. మరోవైపు పోటీ అనేది ప్రతీ చోట ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే మంచి కంటెంట్ వస్తుంది. అన్ని సినిమాలు కూడా గొప్పగా ఆడాలి, అందరూ బాగుండాలని చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా ఇప్పుడు మంచి స్థితిలో ఉంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి రెండు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు తమన్. 

Also Read :  Varasudu Review Telugu: “వారసుడు” రివ్యూ..విజయ్‌ కి షాక్‌ తప్పదా ?

Visitors Are Also Reading