మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఓ మంచి సాలిడ్ హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు రవితేజ. ధమాకా మూవీతో హిట్ అందుకున్నా.. ఇక ఆ తరువాత మళ్లీ ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. తాజాగా టైగర్ నాగేశ్వర్ రావుతో ప్రేక్షకులముందుకొచ్చాడు. రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది కావడం విశేషం. అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు.
Advertisement
వాస్తవఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు వంశీ. మొదటి షో నుంచే టైగర్ నాగేశ్వరరావు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఒక దొంగ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు వంశీ. ఇక ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఈ సినిమాలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను దాదాపు రూ.50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కోసం రవితేజ భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. రవితేజ ఏకంగా రూ.18 కోట్ల వరకు వసూల్ చేశారని తెలుస్తోంది.
Advertisement
రవితేజ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే రవితేజ ఒకొక్క సినిమాకు 10 కోట్ల వరకు వసూల్ చేస్తున్నారట. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఏకంగా 18కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో టైగర్ నాగేశ్వరరావు సినిమా 100కోట్ల వరకు వసూల్ చేస్తుందని అంటున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని తెలుస్తోంది. నెల రోజుల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా ఓటీటీలో విడుదల అయ్యే అవకాశముంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే…!
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి విడాకులు….అసలు వాస్తవం ఇదే!