దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అంతా మంచి శకునాలే అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ ఈ చిత్రం ద్వారానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఆగస్టు 15 వరకు కూడా మంచి బిజినెస్ జరిగిందనే చెప్పాలి. అన్ని విషయాల్లో సీతారామం సినిమా కి కలిసి రావడంతోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి నిన్న ఆగస్టు 15 వరు వరుసగా సెలవులు రావడం ఈ సినిమాకి కలిసి వచ్చిందనే చెప్పవచ్చు.
రాఖీ పండుగ, రెండవ శనివారం, ఆదివారం, సోమవారం, ఇక ఈ సినిమా విడుదలైన రోజు శ్రావణ శుక్రవారం, ఆదివారం ఇలా వరుస సెలవులు ఉండడంతో ఈ సినిమాకి కలెక్షన్లు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు సెలవులు పెద్ద ఎత్తున రావడం వల్లనే మంచి వసూళ్లు నమోదు అయ్యాయనే చెప్పవచ్చు. నితిన్ హీరోగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఎక్కువగా సీతారామం సినిమా చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమా విడుదలకు ముందే మణిరత్నం సినిమా వంటి మంచి సినిమా అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెప్పారు. వారు చెప్పినవిధంగానే ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్లుతుంది.
Advertisement
Advertisement
ముఖ్యంగా ప్రేమకథను చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ గా పేర్కొంటున్నారు. మరోవైపు బింబిసార సినిమాకి కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నప్పటికీ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎక్కువగా సీతారామం సినిమా చూసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక సీతారామం చిత్రానికి రూ.30కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17కోట్లు చేసింది. ఇక ఈ చిత్రానికి అన్ని హక్కులు కలిపి ఇప్పటివరకు దాదాపు రూ.80 కోట్ల వరకు వచ్చాయని సమాచారం. ఖర్చు పెట్టిన దానికంటే రెట్టింపు వసూలు చేసింది ఈ చిత్రం. కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని పేర్కొంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి సీతారామం సినిమా నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
Also Read :
ఎటువంటి ఆహారం, వ్యాయామంతో పని లేకుండా ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోతూ బరువు తగ్గవచ్చు..!
చిరంజీవిపై నాగబాబు కోపంతో ఉన్నాడా..? ఆ కామెంట్ల వెనక అర్థమేంటి..?