నలుగురు స్నేహితులు కలిసి ఒక దగ్గర కూర్చొని సీరియస్‌గా ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. వారిలో ఒక వ్యక్తి చేతులు అటు ఇటు తిప్పుతూ కనుబొమ్మలు ఎగురవేస్తూ చాలా సీరియస్‌గా తన స్నేహితులకు ఏదో కథ చెబుతున్నాడు. అందులో ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఒరేయ్ వినాయక్ మీ నాన్న చాలా కోపంగా వస్తున్నారు రా. ఇక ఈ దెబ్బతో నీ పని అయిపోయినట్టే అని చెప్పాడు. ఆ మాట విన్న వినాయక్ అక్కడి నుంచి పోలీసులు వెనుక పడ్డ దొంగ మాదిరిగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.
Advertisement
ఆ రోజు సాయంత్రం వరకు ఎవ్వరికీ వినాయక్ కనిపించలేదు. చిమ్మ చీకటి కాగానే అలా మెల్లగా ఇంటి గుమ్మం వైపు చూడగా అందరూ యుద్ధం చేయడానికి సిద్ధమైన వారిలా రెడీగా ఉన్నారు. ఈరోజు వాడు ఇంటికి రాగానే వేసేద్దామన్నట్టుగా ఎదురుచూశారు. వివి వినాయక్ సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని చెప్పడంతో ఆయన తండ్రి ఆగ్రహించాడు. అప్పటికే గంపెడు అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని ఏదో ఒక పని చేసి ఆదుకోవాలని సూచించాడు. సినిమా మీద ఉన్న ఆసక్తితో అవేమీ తలకి ఎక్కించుకునే స్థితిలో లేడు వినాయక్. దాదాపు మూడు నెలల పాటు ఇలాగే యుద్ధ వాతావరణం కనిపించింది.
Advertisement
అప్పుడు వినాయక్ వినేవిధంగా కనిపించకపోవడంతో మరోసారి ఎక్కడైనా సినిమా గురించి మాట్లాడిన సినిమా విషయాలు తీసిన ఊరుకోను అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అయినా వినలేదు వినాయక్. అప్పుడు నాలుగు తగిలించాడు తండ్రి పక్కన ఎవరో ఒకరు ఎవరో దర్శకుడు గొప్పతనం గురించి మాట్లాడుకోవడం వింటూ వినాయక్ తనలోని కుతుహలన్నీ చంపుకోలేకపోయాడు. ఎలాగైనా ఒప్పించాలని తండ్రి స్నేహితులందరినీ కూర్చొబెట్టి తన తండ్రిని ఒప్పించేలా చేసి సినీ ఇండస్ట్రీకి వచ్చాడు. అలా తండ్రి మాటను కాదని ఇండస్ట్రీకి వచ్చిన వినాయక్ ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
Also Read : రణ్‌వీర్-దీపికా విడాకులపై క్లారిటీ..!