సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య- సమంత దంపతులు, కోలీవుడ్ కి చెందిన ధనుష్- ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కేవలం వీరే విడాకులు తీసుకున్న దంపతులు చాలా మందే ఉన్నారు. తాజాగా మరో జంటపై విడాకులకు సంబంధించిన రూమర్స్ వినిపిస్తున్నాయి. రణ్‌వీర్‌సింగ్, దీపికాపదుకునే కాస్త డిఫరెంట్ గా కనిపించే ఈ జంట విడాకులు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Advertisement
Also Read : మీరు నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ పిక్ చూశారా..?
తాజాగా దీపికా ఈ రూమర్స్‌పై సమాధానం చెప్పింది. ఈ వార్తలపై మేఘన్ మార్క్‌లే పాడ్‌కాస్ట్‌లో దీపిక పరోక్షంగా స్పందించారు. ఓ మ్యూజిక్ ఫెస్టివల్ వల్ల తన భర్త వారం రోజులుగా దూరంగా ఉన్నాడని, అక్కడి నుంచి తిరిగి వచ్చి తన ముఖం చూసి చాలా సంతోషంగా ఉన్నాడని దీపిక పేర్కొంది. ఆమె చెప్పిన ఈ విషయం విని అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. దీపిక-రణ్‌వీర్‌పై వచ్చిన వార్తలు నిజం కాదని కొట్టిపారేస్తున్నారు. ఈ దంపతులు విడిపోతున్నారన్న వార్తతో కలత చెందిన ఫ్యాన్స్‌కి ఉపశమనం కలిగించింది.
Advertisement
రణవీర్, దీపికా ఆరేళ్ల పాటు డేటింగ్ తరువాత నవంబర్ 14, 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరు తాజాగా ఇద్దరూ స్టార్ల మ్యారేజ్ లైఫ్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకరంటే మరొకరికీ పడడం లేదని, ఇద్దరూ తొందరలోనే విడాకులు తీసుకోబోతున్నారని కొన్ని వారాలుగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తమ ప్రేమను చూపిస్తూ ఈ వార్తలను రణ్‌వీర్, దీపికా ఖండిస్తున్నారు. తాజాగా దీపికా చెప్పిన ఈ సమాధానంతో ఈ రూమర్స్ ఇంతటితో ఆగుతాయేమో లేదో చూడాలి మరి.
Advertisement
Also Read : భార్యతో విడాకులకు రెడీ అవుతున్న బిచ్చగాడు హీరో..? కారణం అదేనా..?